EPAPER

India Germany : ఫోకస్ ఆన్ ఇండియాను భారత్ స్వాగతిస్తోంది, ఛాన్సలర్‌’తో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు

India Germany : ఫోకస్ ఆన్ ఇండియాను భారత్ స్వాగతిస్తోంది, ఛాన్సలర్‌’తో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు

India Germany : జర్మనీ ప్రవేశపెట్టిన ఫోకస్ ఆన్ ఇండియా కార్యక్రమానికి భారత్ మద్ధతు తెలియజేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రదేశం భారత్ అని అభిప్రాయపడ్డారు.


రష్యా ఉక్రెయిన్ వార్ ఆపండి మోదీజీ…

భారత్‌ జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌’ చర్చల్లో భాగంగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌తో (Olaf Scholz) భారత్ విచ్చేశారు. ఈ మేరకు దేశ రాజధాని దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒలాఫ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ సమస్యకు పరిష్కారం తెచ్చేందుకు భారత్‌ చొరవ చూపించాలని ఆయన కోరారు.


భారత్ రెఢీగానే ఉంది…

దీంతో ప్రధాని మోదీ సానుకూలమైన సమాధానం ఇచ్చారు.  ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, వీలైనంత తొందరగా వాటిని పరిష్కారించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ కూడా ఆ దిశగా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు యుద్ధాలతో సమస్యలు సమసిపోతాయని భారత్‌ ఎప్పటికీ భావించదన్నారు.

కొత్త సంస్కరణలు అవసరం…

ఇక 20వ శతాబ్దంలో ఏర్పాటైన ప్రపంచ వేదికలు, కన్వెన్షన్లు, 21 శతాబ్దపు సవాళ్లను పరిష్కరించేందుకు సరిపోవట్లేదని మోదీ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలితో పాటు మిగతా అంతర్జాతీయ సంస్థల్లో వేగవంతమైన సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్నారు. మోదీ ప్రతిపాదనలకు జర్మన్ ఛాన్సలర్ మద్ధతు ఇవ్వడం విశేషం.

వ్యూహాత్మకమైన భాగస్వామ్యం…

దిల్లీలో ఇంటర్‌ గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌ సదస్సును మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అలజడులు, అల్లర్లు, ఉద్రిక్తతలు, విభేదాలు ముసురుకున్నాయన్నారు. అయినప్పటికీ భారత్‌, జర్మనీల మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యం నెలకొందన్నారు. ఇదే ఇరుదేశాల అభివృద్ధికి గట్టి పునాదిగా మారిందన్నారు.

బలమైన ప్రజాస్వామ్యానికి పునాది…

ఒక్క లావాదేవీల వరకే ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పరిమితం కాలేదన్నారు. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాల పరివర్తనకు నిదర్శనంగా మారాయన్నారు.

also read : రేపే తెలంగాణ మంత్రివర్గ సమావేశం, ఈసారి వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్

Related News

Putin Welcomes Trump: ‘యుద్ధం ఆపేందుకు ట్రంప్ సిన్సియర్‌గా కృషి చేస్తారు’.. బ్రిక్స్ సదస్సులో పుతిన్

Hamas Stop War: యుద్ధం ముగించడానికి హమాస్ రెడీ.. ‘గాజాలో ఇజ్రాయెల్ దాడులు అపేస్తే.. ‘

Indian Ambassador Canada: భారతీయ విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు .. కెనెడా అంబాసిడర్ వ్యాఖ్యలు

US Presidential Elections : అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Big Stories

×