EPAPER

Gaza-Fuel : ఆస్పత్రి కాదు.. డీజిల్ స్టోరేజి కేంద్రం

Gaza-Fuel : ఆస్పత్రి కాదు.. డీజిల్ స్టోరేజి కేంద్రం
Gaza-Fuel

Gaza-Fuel : సాధారణంగా ఓ పెట్రో పంప్‌ నిల్వ సామర్థ్యం ఎంత? మనదగ్గర అయితే 20 వేల లీటర్ల వరకు స్టోర్ చేసే వీలుంది. అలాంటి 250 పంప్‌ల ఇంధనం ఒకే చోట నిల్వ చేయగలిగితే? అవును.. దిగ్భ్రమ గొల్పే ఆ చర్యకు పాల్పడింది
హమాస్.


అక్షరాలా అర మిలియన్ లీటర్ల (1,32,000 గాలన్ల) యల్‌ను హమాస్ మిలిటెంట్లు భద్రపరిచారు. అదీ గాజాలోని
అల్-షిఫా ఆస్ప్రతిలో. హమాస్ డీజిల్‌ హమాస్ నిల్వలకు సంబంధించి ఆడియో ఆధారాలను ఇజ్రాయెల్ బలగాలు
బయటపెట్టాయి. గాజాలో డీజిల్ మొత్తాన్ని హమాస్ నియంత్రిస్తున్నట్టు ఆ సంభాషణ ద్వారా తెలుస్తోంది.

ఆస్పత్రి కింద భూగర్భంలో 50 లక్షల లీటర్ల డీజిల్ ను రహస్యంగా నిల్వ చేయడం అందరినీ దిగ్భ్రమ గొల్పుతోంది. విద్యుత్తు, ఇంధన వనరులన్నీ హమాస్ గుప్పిట్లో ఉన్నాయని ఐడీఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. ఆ వనరులను ఉగ్రచర్యలు చేపట్టడానికే తరలిస్తున్నారని ఆరోపించారు.


అంతే కాదు.. గాజాలో ఇంధనాన్ని సరఫరా చేయడమంటే.. ఆ మొత్తాన్ని హమాస్‌కు చేతులకు అప్పగించడమేనని ఆయన చెప్పారు. పౌరులకు ఇంధన వనరులు అందకుండా హమాస్ హైజాక్ చేసి.. రహస్యంగా దాచేస్తోందని ఆరోపించారు.

పౌర వనరులను ప్రజలకు అందకుండా మిలిటెంట్లు దానిని ఉగ్రవాదచర్యలకు వినియోగించే ప్రతి సందర్భాన్ని.. ఆధారాలు సహా తాము బహిర్గతం చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చెబుతోంది. మానవతా దృక్పథంతో
ఆస్పత్రులకు అందజేస్తున్న ఫ్యూయల్‌ను సైతం మిలిటెంట్లు పక్కదోవ పట్టిస్తున్నారని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి హమాస్ కమాండర్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలను సైతం ఐడీఎఫ్ చేజిక్కించుకుంది.

గాజా సిటీ సమీప నార్త్ రిమాల్‌లోని అల్-షిఫా ఆస్పత్రిలో 570 పడకలు ఉన్నాయి. గాజాలో ఇదే అతి పెద్ద ఆస్పత్రి. హమాస్ ఈ ఆస్పత్రిని ఓ క్రమపద్ధతిలో తమ కార్యకలాపాలకు రహస్య స్థావరంగా మార్చుకుంటూ వచ్చింది. ఆస్పత్రికి, అక్కడి రోగులను మానవ కవచంగా మార్చుకుంది. దాని మాటున ఆస్పత్రిని ఏకంగా తమ కమాండ్ సెంటర్‌గా తీర్చిదిద్దింది. అల్-షిఫా ఆస్పత్రి భూగర్భం నుంచి ఆపరేషన్లను కొనసాగిస్తోందంటూ ఇజ్రాయెల్ నెత్తీనోరు బాదుకుంటోంది.

ఇప్పుడు ఆస్పత్రులను ఏకంగా డీజిల్ నిల్వ కేంద్రాలుగా హమాస్ మిలిటెంట్లు మార్చేశారని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారి ఆరోపించారు. ఆస్పత్రుల్లో డీజిల్ రహస్య నిల్వలను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన నిఘా సమాచారాన్ని మిత్రదేశాలతో పంచుకున్నట్టు ఆయన వెల్లడించారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×