Gaza Fire Accident : పాలస్తీనాలోని గాజాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ఇంధనం నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది..కొన్ని గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారందర్నీ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ స్పందించారు. ఘటనను జాతీయ విషాదంగా అభివర్ణించారు. సంతాపదినాలుగా ప్రకటించి మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి పా ముందుకు వచ్చారు. చాలా మంది ప్రజలు వేడి కోసం బొగ్గును కాల్చినప్పుడు శీతాకాలంలో అగ్ని ప్రమాదాలు తలెత్తుతున్నాయని గాజా అధికారులు చెప్పారు.