EPAPER

Gabriel Attal: ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అటల్ రాజీనామా ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్.. ఆపధర్మ ప్రధానిగా కొనసాగింపు..

Gabriel Attal: ఫ్రాన్స్ ప్రధాని గేబ్రియల్ అటల్ రాజీనామా ఆమోదించిన అధ్యక్షుడు మాక్రాన్.. ఆపధర్మ ప్రధానిగా కొనసాగింపు..

Gabriel Attal: ఫ్రాన్స్ ప్రధాన మంత్రి గేబ్రియల్ అటల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రాన్ మంగళవారం రాత్రి ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువు దీరే దాక.. అటల్ ను ఆపధర్మ ప్రధానిగా కొనసాగిస్తున్నట్లు అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించారు.


పార్లమెంటులో కొత్త ప్రధానిని అధ్యక్షుడు మాక్రాన్ నియమించే వరకు అన్ని ప్రభుత్వ బాధ్యతలను గేబ్రియల్ అటల్ నిర్వర్తిస్తారని మాక్రాన్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్త ప్రధనిని ఎప్పుడు నియమిస్తారో.. దానికి ఎంత గడువుపడుతుందో స్పష్టత ఇవ్వలేదు.

Also Read: గాజాలో ఆగని దాడులు.. ఒక్కరాత్రే 60 మంది మృతి


ఫ్రాన్స్ పార్లమెంట్.. నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు గత వారం జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో మూడు పార్టీలలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో హంగ్ ఏర్పడి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతోంది. పైగా ఈ నెల చివర ఫ్రాన్స్‌లో పారిస్ ఒలంపిక్స్ మొదలవుతాయి. ఈ నేపథ్యంలో గేబ్రియల్ అటల్‌ను తాత్కాలికంగా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగమని అధ్యక్షుడు మాక్రాన్ ఆదేశించారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో మాక్రాన్.. కొత్త ప్రధాని ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

బలపరీక్ష గండం తప్పించుకున్న గేబ్రియల్ అటల్
ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ పాపులర్ ఫ్రంట్ లెఫ్టిస్ట్ కోయాలిషన్ కూటమికి అత్యధిక సీట్లు వచ్చాయి. తర్వాత రెండవ, మూడవ స్థానలు మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ అల్లై స్, రైట్ వింగ్ పార్టీ అయిన నేషనల్ ర్యాలీలకు దక్కాయి. కానీ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రానందున ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఏవైనా రెండు పార్టీలు పొత్తు చేసుకోవాలి. కొత్తగా ఏర్పడి ఎన్నికల్లో ముందంజలో దూసుకుపోయిన న్యూ పాపులర్ ఫ్రంట్.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాక్రాన్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు ముందడగు వేసింది. రైట్ వింగ్ భావజాలమున్న నేషనల్ ర్యాలీ పార్టీకి అధికారం దక్కకూడదనే న్యూ పాపులర్ ఫ్రంట్.. మాక్రాన్ కు ఈ ప్రతిపాదన చేసింది.

అయితే అధ్యక్షడు మాక్రాన్ ఇంతవరకు న్యూ పాపులర్ ఫ్రంట్‌తో చేతులు కలిపేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో గేబ్రియల్ అటల్ ప్రధాని పదవిలో కొనసాగుతుండగా.. ఆయనను గద్దెదించాలని.. న్యూ పాపులర్ ఫ్రంట్‌ లో భాగమైన సోషలిస్టులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని పదవిలో కొనసాగేందుకు గేబ్రియల్ అటల్‌ కు అర్హత లేదని.. ఉంటే బలపరీక్షకు ముందుకు రావాలని సోషలిస్టులు వాదిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో గేబ్రియల్ అటల్ గత వారం తన పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పుడు అధ్యక్షుడు మాక్రాన్ ఆ రాజీనామాను అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించినా ఆపధర్మ ప్రధానిగా కొనసాగాలని ఆదేశించారు. అంటే ప్రధానిగా గేబ్రియల్ అటల్ విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేరు.. కానీ అధికారులతో కలిసి కార్యాలయ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు.

Also Read: అమెరికాలో కాస్పర్‌‌స్కై దుకాణం బంద్.. ఈనెల 20 చివరిరోజు

ప్రధాని పదవి కోసం న్యూ పాపులర్ ఫ్రంట్‌ లో చీలికలు
ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన న్యూ పాపులర్ ఫ్రంట్‌ లో మూడు ఫ్యాక్షన్లున్నాయి. మొదటి ఫ్యాక్షన్ కమ్యూ నిస్టులైన ఫ్రాన్స్ అన్ బోవ్డ్, ది సోషలిస్ట్స్, ది గ్రీన్స్. ఈ మూడు ఫ్యాక్షన్లలో ప్రధాన మంత్రి పదవి తమకంటే తమకు కావాలని డిమాండ్లు చేసుకుంటున్నారు. వారం రోజులుగా కమ్యూనిస్టు ఫ్రాన్స్ అన్ బోవ్డ్, సోషలిస్టుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఈ వాదనల్లో ఒకరినొరకు వ్యక్తిగతంగానూ విమర్శించుకుంటూ గొడవలు పడుతున్నారు.

ఇదంతా చూసి.. రైటి వింగ్ పార్టీ నేషనల్ ర్యాలీ నాయకురాలు మెరైన్ లీపెన్ ఒక ట్వీట్ చేశారు. వీరి గొడవలు చూసి.. ఈ రెండు పార్టీలు కలిసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని.. అందుకు ఈ గొడవలే కారణమని లీ పెన్ ట్విట్టర్-Xలో రాశారు. అవసరమైతే ఎన్నికల్లో పాల్గొన్న అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని.. అందుకు తమ పార్టీ సహకరిస్తుందని ఆమె అన్నారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×