EPAPER
Kirrak Couples Episode 1

Flight: అదృష్టం అంటే నీది బాసూ.. ఏడుసార్లు విమాన ప్రమాదం.. అయినా కూడా

Flight: అదృష్టం అంటే నీది బాసూ.. ఏడుసార్లు విమాన ప్రమాదం.. అయినా కూడా

Flight: కొన్నికొన్ని సార్లు మనకు మనమే ప్రమాదాలను కొనితెచ్చుకుంటాము. ప్రమాదం జరిగే వరకు తెలీదు దాని వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. కానీ అతనికి భూమిపైన నూకలు ఉండడంతో ఏకంగా ఏడుసార్లు భారీ ప్రమాదాల నుంచి సురక్షితంగా తప్పించుకున్నాడు.


అమెరికాకు చెందిన డెన్నిస్ కోలియర్ అనే వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితం పైలెట్‌గా పనిచేశాడు. అతడికి విమానం కొనుక్కోవాలని కోరికపుట్టింది. వెంటనే సెకండ్ హ్యాండ్ విమానాల కోసం ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించాడు. చివరికి ఓ చిన్న విమానం అతడికి దొరికింది. 2021లో రూ. కోటి పెట్టి దాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానం మూలనపడి దాదాపు రెండేళ్లు కావడంతో మళ్లీ భారీగా ఖర్చు చేసి మరమ్మత్తులు చేయించాడు.

చివరికి విమానం రెడీ అయిపోయింది. జూన్ నెలాఖరులో మొదటిసారి ఆ విమానం నడుపుతూ గాలిలో చక్కర్లు కొట్టాడు. అయితే ల్యాండింగ్ చేసే సమయంలో ల్యాండింగ్ గేర్ వేయడం మరిచిపోవడంతో.. విమానం అడుగు భాగం రన్‌వేకు తాకుతూ ల్యాండ్ అయింది. ఇలా మొదటిసారి భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.


ఈ ప్రమాదం జరిగిన కొద్దిరోజులకు అదే విమానంలో క్యాలిఫోర్నియా నుంచి మెక్సికోకు బయల్దేరాడు. అయితే ల్యాండింగ్ లైట్స్ సరిగా పనిచేయకపోవడంతో.. రన్‌వే ఎక్కడుందో అర్థం కాక.. అలానే ల్యాండ్ చేశాడు. ఈక్రమంలో రన్‌వే పక్కన ఉన్న ఎలక్ట్రిక్ స్థంభాలను ఢీకొట్టాడు. ఆ తర్వాత రెండు రోజులకు మరో సారి కూడా అలానే స్థంభాలను ఢీకొట్టాడు. ఇప్పటికి మూడుసార్లు భారీ ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు.

ఇక నాలుగోసారి క్యాలిఫోర్నియా నుంచి ఓనిల్ వెళ్లేందుకు పయణమయ్యాడు. అయితే విమాణం గాలిలోకి ఎగిరాక.. ఎడమ రెక్క హింగ్డ్ ట్యాబ్ ఇరుక్కుపోయింది. ల్యాండ్ చేయడం కష్టంగా మారింది. చివరికి ఎలానో అలా ల్యాండ్ చేస్తుండగా.. రన్‌వే పక్కన ఉన్న ఎలక్ట్రిక్ లైట్లను ఢీకొట్టాడు. దీంతో రన్‌వే పై నుంచి విమానం పక్కకు దూసుకెళ్లి పక్కన ఉన్న ప్లేన్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న కొద్దిరోజులుగా నెబ్రాస్కాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పుడు స్వల్ప గాయాలతో భయటపడ్డాడు.

ముచ్చటగా ఆరోసారి గాలిలో ఎగురుతుండగా ఎడమ ల్యాండింగ్ గేర్ దానికి అదే కిందకు జారిపోయింది. వెంటనే విమానాన్ని ల్యాండ్ చేయాలని డెన్నిస్ నిర్ణయించుకున్నాడు. దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేస్తుండగా.. ముందుభాగం, నోస్ గేర్ డోర్ రన్‌వేకు తాకి పూర్తిగా దెబ్బతింది.

అయినా కూడా మనోడు మళ్లీ మరమ్మత్తులు చేయించాడు. మళ్లీ దానిలో గాలిలోకి ఎగిరాడు. బోయిన్ సిటీకి 80 మైళ్ల దూరంలో విమానం మిషిగాన్ లేక్‌పై ఎగురుతుండగా.. ఇంజిన్ నుంచి ఇంధనం లీక్ అయింది. దెబ్బకు డెనిస్‌కు దేవుడు గుర్తొచ్చాడు. ప్రాణభయం పట్టుకుంది. ఆరుసార్లు తప్పించుకున్నా.. ఈ సారి తప్పించుకునే ఛాన్స్ లేదనుకున్నాడు. అయితే ఆయన కొన్న విమానం నేలపైనా.. నీళ్లపైన కూడా ల్యాండ్ చేయవచ్చు. ఆ విషయం అప్పటి వరకు డెనిస్‌కు తెలియదు.

చివరికి ఎలాగో అలా విమానాన్ని నీటిపై సురక్షితంగా ల్యాండ్ చేశాడు. మనోడికి ప్రాణాలు తిరిగొచ్చినంత పని అయింది. ఇక డెనిస్ విమానంపైకి ఎక్కి సాయం కోసం కేకలు వేశాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న కోస్ట్ గార్డ్స్ అతడిని గుర్తించి.. వచ్చి కాపాడారు. ఇలా డెన్నిస్ కోలియర్ ఏడుసార్లు భారీ ప్రమాదాల నుంచి బయటపడ్డాడు.

Tags

Related News

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Big Stories

×