EPAPER

Indian Ambassador Canada: భారతీయ విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు .. కెనెడా అంబాసిడర్ వ్యాఖ్యలు

Indian Ambassador Canada: భారతీయ విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు .. కెనెడా అంబాసిడర్ వ్యాఖ్యలు

Indian Ambassador Canada| కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులను ప్రభావితం చేస్తున్నారని.. ఖలిస్తానీ అతివాదం నుంచి విద్యార్థులు దూరంగా ఉండాలని కెనెడాలో ఇండియన్ హై కమిషనర్‌గా ఇంతకాలం పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ్ చెప్పారు. గురువారం అక్టోబర్ 25, 2024న ఆయన ఒక జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. ఇండియాలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు కెనెడాలో ఉన్న తమ పిల్లలతో తరుచూ మాట్లాడుతూ.. వారు తప్పుడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తులు చెప్పాలని లేకుంటే వారి భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.


”కెనెడాలో నివసిస్తున్న ఇండియన్స్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి ఇటీవల కాలంలో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా కెనెడాలో చదువుకోవడానికి వెళ్లిన 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ సురక్షితంగా లేరు. ప్రస్తుతం కెనెడాలో నిరుద్యోగం సమస్య తీవ్రంగా ఉండడంతో అక్కడ చదువు పూర్తిచేసిన విద్యార్థులును, చదువుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారిని ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు సంప్రదిస్తారు. విద్యార్థులకు భోజనం, డబ్బు ఇచ్చి ప్రలోభ పెడతారు. ఆ తరువాత తమ ఖలిస్తానీ అతివాదం వైపు విద్యార్థులను ఆకర్షిస్తారు. అక్కడ ఇది జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు భారతదేశానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొని భారత జెండాని అవమానిస్తూ.. నినాదాలు చేసిన వీడియోలు ఉన్నాయి.. ఇదంతా కెనెడాలోని ఇండియన్ ఎంబసీ, కౌన్సులేట్ ఎదుటే జరుగుతోంది.

ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది. ఎందుకంటే ఇండియాకు వ్యతిరేకంగా నిరసనలు చేశాక.. కెనెడా ప్రభుత్వం వద్ద ఈ విద్యార్థులంతా కలిసి శరుణు కోరతారు. భారతదేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు కాబట్టి వారు ఇండియా తిరిగి వచ్చాక వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారంతా కారణాలు చూపుతారు. ఆశ్చర్యకరంగా కెనెడా ప్రభుత్వం వారికి శరణార్థులుగా అక్కడే ఉండేందుకు అనుమతులిస్తోంది. దీనికి వెనుక కూడా ఖలిస్తానీ అతివాదులున్నారు. భారతీయ విద్యార్థులు వారితో చేరి తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులే ఇదంతా జరగకుండా జాగ్రత్త పడాలి” అని సంజయ్ కుమార్ వర్మ అన్నారు.


Also Read: లారెన్స్ బిష్నోయిని చంపితే రూ.కోటి పదకొండ లక్షలు.. బహిరంగ ప్రకటన చేసిన కర్ణిసేన..

కొన్ని రోజుల క్రితం కెనెడా ప్రధాన మంత్రి జస్టిన ట్రూడో భారతదేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కెనెడా పౌరులను ఇండియా ప్రభుత్వం హత్య చేయించిందని బహిరంగంగా ప్రకటించారు. ఇండియా ప్రభుత్వం.. క్రిమినల్ గ్యాంగ్స్ ద్వారా ఈ హత్య చేసేందుకు కుట్రలు చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యల కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటు కెనెడాలో ఉన్న అంబాసిడర్, హై కమిషనర్.. ఇతర దౌత్య అధికారులను ఇండియా తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఇక్కడ భారతదేశంలో ఉన్న కెనెడా అంబాసిడర్ ని కూడా వారి దేశం తిరిగి వెళ్లిపోవాలని చెప్పింది.

కెనెడా పౌరసత్వం ఉన్న ఖలిస్తానీ సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ ని కెనెడా వాంకోవర్ నగరంలో 2023లో హత్య చేశారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని కెనెడా ప్రధాని ఆరోపించారు. కానీ కెనెడా ప్రధాని కేవలం ఆరోపణలే చేస్తున్నారే తప్ప సరైన ఆధారాలు చూపించడం లేదని భారత ప్రభుత్వం విమర్శించింది. కెనెడా ప్రధాని ట్రూడో ఆరోపణలను కొట్టిపారేసింది. కెనెడాలో కూడా ప్రధాని ట్రూడోని ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ ఈ విషయంలో వివరణ అడిగింది. ఆ సమయంలో కూడా ప్రధాని ట్రూడో తమ వద్ద సరైన ఆధారాలు లేవు.. కానీ పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్పారు.

కెనెడా పోలీసులు ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి హస్తం ఉందని.. ఇండియన్ హై కమిషనర్ సంజయ్ వర్మకు కూడా ఈ హత్య కేసులో లింకులున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

Related News

Hamas Stop War: యుద్ధం ముగించడానికి హమాస్ రెడీ.. ‘గాజాలో ఇజ్రాయెల్ దాడులు అపేస్తే.. ‘

US Presidential Elections : అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

BRICS INDIA CHINA: ‘బ్రిక్స్ ఒక కలగానే మిగిలిపోతుంది’.. ఇండియా, చైనా సంబంధాలే కీలకం..

Big Stories

×