EPAPER

Ex Youtube CEO : ఆ డిసీజ్ తో యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కి కన్నుమూత

Ex Youtube CEO : ఆ డిసీజ్ తో యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కి కన్నుమూత

EX- Youtube CEO Susan Wojcicki Passed Away(Latest world news): యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్ కి మరణించారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. 56 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ X వేదికగా తెలుపుతూ.. నివాళులు అర్పించారు. ఆమె అద్భుతమైన వ్యక్తి అని.. నమ్మలేని విధంగా ఆమె మరణించడం బాధాకరంగా ఉందని రాసుకొచ్చారు. గూగుల్ చరిత్రలో వోజ్ కి ఒక కీలకమైన వ్యక్తి అని.. ఇంటర్నెట్ ను రూపొందించడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించారన్నారు. సుసాన్ వోజ్ కి 2014 నుంచి 2023 వరకూ యూట్యూబ్ సీఈఓగా ఉన్నారు.


వోజ్కికీ భర్త ఫేస్ బుక్ లో భావోద్వేగమైన పోస్ట్ చేశాడు. ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్.. తన భార్యకు చాలా మంచి మనసు ఉందని, ఎంతోమందికి ప్రియమైన స్నేహితురాలని అభివర్ణించాడు. 56 సంవత్సరాల తన భార్య మరణించిందని చెప్పేందుకు చాలా బాధగా ఉందని, తన ఐదుగురు పిల్లలకు తల్లి అయిన సుసాన్ వోజ్కికీ క్యాన్సర్ తో రెండేళ్లుగా పోరాడి.. ఆఖరికి వదిలి వెళ్లిపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కేవలం తన భార్యే కాదని, మంచి స్నేహితురాలు, ప్రేమను పంచేతల్లి కూడా అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు డెన్నిస్ ట్రోపర్.

సుసాన్ వోజ్కికీ 1968 జూలై 5న జన్మించారు. గడిచిన 20 ఏళ్లలో ఆమె సాంకేతిక రంగంపై ఫోకస్ చేశారు. గూగుల్ తో ఆమె ప్రొఫెషనల్ లైఫ్ మొదలైంది. గూగుల్ లో పనిచేసిన ఉద్యోగుల్లో ఆమె 16వ ఉద్యోగి. గూగుల్ లో ప్రకటనలు, యాడ్ సెన్స్ ను సంభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందామె. సుసాన్ వోజ్కికీ వల్ల గూగుల్ కు ఆదాయం భారీగా పెరిగింది. 2006 లో యూట్యూబ్ ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. 2014లో ఆమె యూట్యూబ్ సీఈఓగా నియమితులై.. 2023 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. ఆమె పదవీకాలంలో యూట్యూబ్ లాగిన్ యూజర్ల సంఖ్య 2 బిలియన్లకు చేరుకుంది. 2021 వరకూ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు, మీడియా కంపెనీలకు 30 బిలియన్ డాలర్లను చెల్లించారు.

సుసాన్ వోజ్కికీ నాయకత్వంలో యూట్యూబ్ 80 భాషల్లో 100 దేశాలలో విస్తరించింది. ఫిబ్రవరి 2023లో రోజువారీ వ్యూస్ 50 బిలియన్ల మార్క్ ను దాటేసింది. యూట్యూబ్ ప్రీమియమ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ షార్ట్స్ వంటి కొత్త కొత్త ఫీచర్స్ ను పరిచయం చేశారు. యూట్యూబ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ ద్వారా ఎడ్యుకేషనల్ కంటెంట్ కు ప్రాధాన్యమిచ్చారు. యూట్యూబ్ లో పనిచేసే మహిళా ఉద్యోగులను 24 శాతం నుంచి 30 శాతానికి పెంచారు.

యూట్యూబ్ సీఈఓగా రాజీనామా చేసిన ఏడాదికి సుసాన్ వోజ్కికీ తన 19 ఏళ్ల కొడుకును కోల్పోయారు. గతేడాది ఫిబ్రవరి 13న మార్కో ట్రోపర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. క్లార్క్ కెర్ క్యాంపస్ లోని హాస్టల్ లో మార్కో నిర్జీవంగా పడి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. బహుశా డ్రగ్స్ ఎక్కువ కావడంతో చనిపోయి ఉండవచ్చని బామ్మ ఎస్తర్ వోజ్కికీ అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టంలో అక్యూట్ కంబైన్డ్ డ్రగ్ టాక్సిసిటీ కారణంగా మరణించినట్లు వెల్లడైంది. అది ప్రమాదకరమైన డ్రగ్ అని.. ఇది చట్టవిరుద్ధం కూడా అని పోలీసులు వెల్లడించారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×