EPAPER

Ex-Bangladesh PM Khaleda Zia: బంగ్లా మాజీ ప్రధాని జియా..సొంతింటికి ఆగయా

Ex-Bangladesh PM Khaleda Zia: బంగ్లా మాజీ ప్రధాని జియా..సొంతింటికి ఆగయా

Ex-Bangladesh PM Khaleda Zia back home after over 17 years punishmet: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఐదు సంవత్సరాల గృహ నిర్బంధం తర్వాత ఢాకాలోని ఆమె నివాస గృహానికి చేరుకున్నారు. విదేశీ విరాళాల స్కామ్ లో ఖలీదా పాత్ర ఉందనే ఆరోపణలపై 17 ఏళ్లుగా ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ఐదేళ్లుగా మాత్రమే ఆమెను అనారోగ్య కారణాలతో గృహ నిర్బంధంలో ఉన్నారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా రాజీనామా అనంతరం అక్కడ వేగవంతంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో షేక్ హసీనాపై 12 కేసులు నమోదయ్యాయి. షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం విదేశాలకు పారిపోవడం..ఆమె చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా విడుదలవడం జరిగిపోయాయి. 79 ఏళ్ల ఖలీదా జియా 1991 నుంచి 1996 దాకా బంగ్లాదేశ్ ప్రధానిగా చేశారు. తర్వాత 2001 నుంచి 2006 వరకూ రెండో పర్యాయం కూడా ప్రధానిగా చేశారు.


5 ఏళ్లుగా గృహ నిర్బంధంలోనే..

అవినీతి కేసుకు సంబంధించి ఆమె జైలుపాలయ్యారు. బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించే అతి పెద్ద బీఎస్ పీ ..బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు. కాగా అవినీతి కేసులో అరెస్టయిన ఖలీదా జియా గత ఐదేళ్లుగా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఖలీదా జియా భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయీ గుడి ప్రాంతంలో జన్మించారు. ఈమె భర్త జియాపూర్ రెహ్మాన్ లెఫ్టినెంట్ జనరల్ గా బంగ్లా ఆర్మీలో పనిచేశారు. మిలటరీలో అంచెలంచెలుగా ఎదిగిన రెహ్మాన్ 1977 నుంచి 1981 వరకూ బంగ్లా దేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 1981లో రెహ్మాన్ ను దుండగులు హత్య చేశారు. అక్కడినుంచే ఖలీదా జియా రాజకీయ నేపథ్యం మొదలయింది. ఖలీదా జియా మద్దతుదారుల సందర్శనతో ప్రస్తుతం ఖలీదా ఇంటిలో సందడి వాతావరణం నెలకొంది.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×