EPAPER

England Southport Stabbing: ముగ్గురు చిన్న పిల్లల హత్య కేసు నిందితుడు ఇతనే.. టీనేజర్ వివరాలు వెల్లడించిన కోర్టు

England Southport Stabbing: ముగ్గురు చిన్న పిల్లల హత్య కేసు నిందితుడు ఇతనే.. టీనేజర్ వివరాలు వెల్లడించిన కోర్టు

England Southport Stabbing(Latest international news today): ఇంగ్లాండ్ లో ఇటీవల ముగ్గురు చిన్న పిల్లలని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన దుమారం రేగింది. ఈ ఘటనపై రోజురోజుకీ రోడ్లపై నిరసనలు చేస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది. పైగా ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు రోడ్లపై వచ్చి పోలీసులపై దాడులు చేస్తున్నారు. తమ పిల్లలకు భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. దోషులన తామే మరణ శిక్ష విధిస్తామని నిరసనలు చేస్తున్నారు.


అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఓ 17 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. చట్ట ప్రకరం.. అతను టీనేజర్ కావడంతో అతని గుర్తింపు వివరాలు వెల్లడించలేదు. కానీ పిల్లలను హత్య చేసిన వ్యక్తులు వీరే నంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇతర వ్యక్తులపై అనుమానంతో దాడులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ హింసాత్మక ఘటనల కారణంగా ఇంగ్లండ్ కోర్టు నిందితుడి వివరాలు వెల్లడించింది.

పోలీసుల కస్టడీలో ఉన్న 17 ఏళ్ల నిందితుడి పేరు ఆక్సెల్ ముగన్వా రుడకుబానా. ఇంగ్లాండ్ లోని లాంక్ షైర్, బ్యాంక్స్ ప్రాంతానికి చెందిన ఈ నల్ల జాతీయుడు.. సౌత్ పోర్టు ప్రాంతంలో స్కూల్ డాన్స్ క్లాసులో ఉన్న మొత్తం 11 మందిపై దాడి కత్తితో దాడి చేశాడు. వారిలో ముగ్గురు ఆడపిల్లలు (6, 7, 9 ఏళ్ల వయసు) చనిపోయారు. మిగతా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సౌత్ పోర్టు ప్రాంతంలోని హార్ట్ స్ట్రీట్ లో మధ్యాహ్నం సమయంలో జరిగింది. పిల్లల హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఆక్సెల్.. టీనేజర్ కావడంతో అతన్ని జువెనైల్ ప్రిసన్ లో ఉంచారు. అతనికి మరో వారం రోజుల తరువాత 18 ఏళ్లు పూర్తవుతాయి.


Also Read: ‘ఎయిర్ హోస్టెస్ నాతో శృంగారం చేయాలి లేకపోతే దూకేస్తా’.. విమానంలో ప్రయాణికుడి హల్ చల్!

నిందితుడి గుర్తింపు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుండడంతో ప్రజలు హింసాత్మకంగా మారుతున్నారు. ఈ హింసాత్మక ప్రదర్శనల్లో ప్రజలు రాళ్లు రువడ్డంతో పాటు కొంతమంది కత్తులతో కూడా పోలీసులపై దాడి చేశారని సమాచారం. ఈ నిరసనల్లో ఇప్పటివరకు మొత్తం 53 మంది పోలీసులు గాయపడ్డారు. నిరసనల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారిలో దాదాపు 100 మందిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఉద్రిక్త పరిస్థితులను గమనించి.. తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయడానికి కేసు విచారణ చేస్తున్న లివర్ పూల్ కోర్టు న్యాయమూర్తి ఆండ్రూ మెనారీ కెసీ నిందితుడి వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు. దీంతో మీడియా ఆక్సెల్ ముగన్వా రుడకుబానా పేరును వెల్లడించింది. 17 ఏళ్ల ఆక్సెల్ మానసిక వ్యాధితో బాధపడతున్నాడని అతనికి తీవ్ర ఆటిస్టిక్ స్పెక్‌ట్రమ్ ఉందని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లల హత్య కేసులో ఆక్సెల్ ముగన్వా రుడకుబానాపై విచారణ అక్టోబర్ 25కు కోర్టు వాయిదా వేసింది.

Also Read:  ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×