EPAPER

Elon Musk congratulates PM Modi| అత్యధిక ఎక్స్ ఫాలోవర్స్ కలిగిన నాయకుడు మోదీ.. భారత ప్రధానికి శుభాకంక్షలు తెలిపిన మస్క్

Elon Musk congratulates PM Modi| అత్యధిక ఎక్స్ ఫాలోవర్స్ కలిగిన నాయకుడు మోదీ.. భారత ప్రధానికి శుభాకంక్షలు తెలిపిన మస్క్

Elon Musk congratulates PM Modi| సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రికార్డు సృష్టించారు. ఈ రికార్డు సాధించినందుకు ప్రధాని మోదీకి టెస్లా సిఈఓ ఇలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.


”ప్రపంచ నాయకులలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి నా శుభాకాంక్షలు,” అని మస్క్ తన పోస్ట్ లో రాశారు.

గత వారం ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్‌‌ని ఫాలో చేసేవారి సంఖ్య 100 మిలియన్లు దాటింది. దీంతో ఆయన ప్రపంచంలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన నాయకుడిగా రికార్డు సాధించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ అల్ రాషిద్ అల్ మక్తూమ్, పోప్ ఫ్రాన్సిస్ కంటే భారత ప్రధానికి ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్నారు.


భారత రాజకీయాలలో కూడా ప్రధాని మోదీయే టాప్
దేశ రాజకీయ నాయకులలో ట్విట్టర్ జాబితాలో కూడా ప్రదాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీ.. ట్విట్టర్ ఎక్స్‌లో 100 మిలియన్ ఫాలోయర్స్ గల భారీ అభిమాన గణంతో టాప్‌లో ఉంటే.. రెండవ స్థానంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నా.. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో చేస్తున్న వారి సంఖ్య 27.5 మిలియన్లు. మూడో స్థానంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీకి ట్విట్టర్ ఎక్స్‌లో 26.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

నాలుగో స్థానంలో 19.9 మిలియన్ల ఫాలోయర్స్‌తో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 7.4 మిలియన్ల మంది ఫాలోయర్స్‌తో అయిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తరువాత ఆరు, ఏడు స్థానాల్లో బిహార్ ఆర్జెడీ నాయకులు, తండ్రీ కొడుకులు లాలూ ప్రసాద్ యాదవ్ (6.3 మలియన్లు), తేజస్వి యాదవ్ (5.2 మిలయన్లు) ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాలో భీష్ముడు అయిన శరద్ పవార్ కు ఎక్స్‌లో 2.9 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

Also Read: విండోస్ ఎఫెక్ట్‌పై ఛైర్మన్ సత్య నాదెళ్ల ఫస్ట్ రియాక్షన్

క్రీడాకారుల కన్నా ఎక్కువ ట్విట్టర్ ఫాలోయింగ్ కలిగిన మోదీ
రాజకీయ నాయకులు సరే.. కానీ క్రీడాకారులకు విపరీతమైన అభిమానులుంటారు. కానీ క్రీడాకారులను కూడా ప్రధాని మోదీ వెనక్కి నెట్టేశారు. ఎక్స్‌లో అత్యధికంగా విరాట్ కోహ్లీకి 64.1 మిలియన్ ఫాలోయర్స్ ఉండగా, బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు నేమార్ కు 63.6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్‌కు 52.9 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే అమెరికా సెలెబ్రిటీలు టేలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్), లేడీ గాగా (83.1 మిలియన్), కిమ్ కర్దాషియన్ (75.2 మిలియన్) ఫాలోయర్స్ ఉన్నారు. వీరిందరినీ ప్రధాని మోదీ దాటేశారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×