EPAPER

Donald trump vs Kamala harris: ట్రంప్ వర్సెస్ కమలాహారిస్.. తొలి డిబేట్‌కు డేట్ ఫిక్స్

Donald trump vs Kamala harris: ట్రంప్ వర్సెస్ కమలాహారిస్.. తొలి డిబేట్‌కు డేట్ ఫిక్స్

Donald trump vs Kamala harris(International news in telugu): అమెరికాలో అధ్యక్ష ఎన్నిక ముదిరిపాకాన పడింది. అధికార డెమోక్రటిక్ పార్టీ తరపున కమలాహారిస్- రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్‌ట్రంప్ తలపడుతున్నారు.  అయితే వీరిద్దరి మధ్య ఫస్ట్ డిబేట్ సెప్టెంబర్ నాలుగున జరగనుంది. మరి ఈసారి పైచేయి ఎవరిదో చూడాలి.


అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యం కారణం గా రేసు నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ రేసులోకి వచ్చారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అధికార డెమోక్రటిక్ పార్టీ ఖరారు చేసింది. కమలాహారిస్‌కు ఆ పార్టీ నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది. అంతేకాదు నేతలు ఫండ్ రైజింగ్‌ కార్యక్రమాల్లో నిమగ్నయ్యారు.

కమలాహారిస్‌తో టీవీ డిబేట్‌కు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారు. ఫాక్స్ న్యూస్ ఆఫర్‌ని ఆయన అంగీకరించారు. ప్రజల మధ్య ఈ ముఖాముఖి చర్చ జరగాలని షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి డిబేట్ సెప్టెంబర్ నాలుగున జరగనుంది. వాస్తవానికి  సెప్టెంబర్ 10న ఏబీసీ ఛానెల్‌లో బైడెన్‌తో టీవీ డిబేట్‌లో ట్రంప్ పాల్గొనాలి. అయితే బైడెన్ డ్రాప్ కావడంతో ఆ డిబేట్ రద్దయ్యింది. ఇప్పుడు ఫాక్స్ న్యూస్ వంతైంది. పెన్సిల్వేనియాలో వేదికగా ఈ డిబేట్ జరగనుంది.


ALSO READ: ముగ్గురు చిన్న పిల్లల హత్య కేసు నిందితుడు ఇతనే.. టీనేజర్ వివరాలు వెల్లడించిన కోర్టు

ట్రంప్‌తో డిబేట్‌కు కమలాహారిస్ ఓకే చెప్పారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. దీనికి గురించి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు రియాక్ట్ కాలేదు. 59 ఏళ్ల కమలాహారిస్ భారత్-ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్. ప్రస్తుతం ఆదేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ తరపున అవసరమైన ఓట్లను వర్చువల్ రోల్ కాల్‌లో ప్రతినిధుల నుంచి పొందారు. వచ్చేవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ ఐదున ఎన్నికలు జరగనున్నాయి.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×