EPAPER

AI video of Elon Musk, Trump: నడి రోడ్డుపై ట్రంప్, మస్క్ డ్యాన్సులతో అదరగొట్టారు

AI video of Elon Musk, Trump: నడి రోడ్డుపై ట్రంప్, మస్క్ డ్యాన్సులతో అదరగొట్టారు

Donald Trump shares AI video of him Elon Musk grooving to ‘Stayin’ Alive’:వారిద్దరూ గ్లోబల్ సెలబ్రిటీలు. ఒకరేమో మాజీ అమెరికా అధ్యక్షుడు, మరొకరు ప్రపంచాన్ని శాసించే కుబేరుడు. ఇద్దరూ కలిసి నడిరోడ్డుపై ఊరమాస్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడదే జరిగింది. వీరిద్దరూ కలిసి స్టే ఇన్ అలైవ్ పాటకు స్టెప్పులు వేసి అభిమానులకు మంచి కిక్కు ఇచ్చారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు అపర కుబేరుడితో కలిసి స్టెప్పులు వేయడమేమిటని అంతా ఆశ్చర్యపోయారు. పైగా ఇద్దరూ నడి వయసువారే అయినప్పటికీ టీనేజ్ కుర్రోళ్ల మాదిరిగా స్టెప్పులు వేస్తుంటే అంతా పరవశించిపోయారు.


అంతా..డూప్

ఇదంతా నిజమేననుకుంటే కర్రీలో కాలేసినట్లే..విషయం ఏమిటంటే ప్రస్తుతం పెరిగిపోయిన టెక్నాలజీ ఏఐ సాయంతో ఈ సంచలన వీడియోను సోషల్ మీడియాకి వదిలారు. ఇంకేముందు క్షణాలలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో.ఇటీవల అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ను ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా సందర్భం చూసి వదిలిన ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట ఈ వీడియోను యూటా సెనెటర్ మైక్ లీ ట్వీట్ చేశారు అమెరికా నుంచి. కాగా ఈ వీడియోను వీక్షించిన ఎలాన్ మస్క్ మళ్లీ దీనిని రీ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఏడు కోట్ల మందికి పైగా వ్యూయర్స్ ఈ వీడియోను వీక్షించగా దాదాపు నాలుగు కోట్ల మంది రీ ట్వీట్ చేయడం విశేషం. ట్రంప్ వర్గం కూడా దీనిని సరదాగానే తీసుకున్నారు.


ట్రంప్ కు కలిసొచ్చే ప్రచారం

ట్రంప్ వ్యతిరేక వర్గం మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకున్న దశలో దీనిని కూడా ట్రంప్ తన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటారని విమర్శిస్తున్నారు. దానికి కౌంటర్ గా ట్రంప్ వర్గం కూడా ఇది తాము రూపొందించిన వీడియో కాదని..ఎవరో సరదాగా దీనిని రూపొందించారని..ప్రచారం కోసం అలాంటి చీఫ్ ట్రిక్స్ తాము ఎప్పటికీ చేయబోమని స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం దీనిని సో ఫన్నీగా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. టీనేజ్ స్టూడెంట్స్ మాదిరిగా ఇద్దరూ కలిసి చేస్తున్న వీడియో చాలా బాగుందని ఇప్పటికే తాను ఓ పదిసార్లకు పైగా చూశానని ఓ నెటిజన్ చెబుతున్నాడు.

నాటు పాట జోడిస్తే..

ఇక మన తెలుగు వాళ్లు త్వరలో దీనికి ఆస్కార్ సాంగ్ నాటు నాటు లిరిక్స్ ను జోడించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే దేనినైనా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగువాళ్లకు మించినవారు లేరు అంటున్నారు పబ్లిక్. తాను ఇప్పటిదాకా ఈ తరహా వీడియోలు చాలానే చూశానని..కానీ ట్రంప్, మస్క్ ఫన్నీ డ్యాన్స్ చాలా బాగుందని ఇలాంటి వీడియో గతంలో తాను చూడలేదని ఓ వ్యూయర్ అన్నాడు. మరో వ్యూయర్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ఏఐ అందుబాటులోకి వచ్చాక ఏది వాస్తవమూ.. ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారిందని అన్నారు. ఏది ఏమైనా పెరిగిపోయిన ఈ సాంకేతిక పరిజ్ణానాన్ని మంచికి ఉపయోగించుకుంటే ఫరవాలేదు..సంఘ విద్రోహ చర్యలకు దోహదం చేసేలా ఉపయోగిస్తేనే ప్రమాదం అంటున్నారంతా.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×