EPAPER

Firing on Donald Trump: పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు.. పలుచోట్ల గాయాలు.. ఎవరి పని..?

Firing on Donald Trump: పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు.. పలుచోట్ల గాయాలు.. ఎవరి పని..?

Donald Trump Injured after Shooting: యావత్తు అమెరికా షాకయ్యే ఘటన అది. పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌పై కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు. వెంటనే ఆయన్ని సమీపంలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే కాల్పులు జరిపిన దుండగుడ్ని భద్రతా బలగాలు కాల్చిచంపాయి. అసలేం జరిగిందంటే..


అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కీలక పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నా రు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నాయి. అరుపులు, కేకలతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఈ ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ ఆ ప్రాంతంలో కిందకు వంగిపోయారు. లేకుంటే పరిస్థితి ఊహించని విధంగా ఉండేదని అంటున్నారు. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ కవచంగా ఏర్పడ్డారు. ఆ సమయంలో ట్రంప్ పిడికిలి బిగించి చేయి పైకెత్తారు.


Also Read: ఇజ్రాయిల్ హింసాత్మక దాడి, 71 మంది మృతి

ఆదేశ సీక్రెట్ విభాగంగా వెంటనే ట్రంప్‌ను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బాగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నమాట. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. బులెట్ తగిలి ఒకరు మృత్యువాతపడగా, కాల్పులు జరిపిన దుండగున్ని బలగాలు కాల్పి చంపాయి.

ఈ ఘటన వెనుక ఏం జరిగింది? కాల్పుల పని ఎవరిది? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఈ ఘటనపై బైడెన్ సర్కార్ అలర్ట్ అయ్యింది. ట్రంప్‌పై దాడిని ఖండించిన అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షు రాలు కమలా హారిస్, ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా లో హింసకు తావులేదన్నారు. గాయపడిన ట్రంప్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కాల్పుల ఘటనలో తూటా ట్రంప్‌కు వెనుక నుంచి వచ్చింది. ఫైరింగ్ జరిగిన ప్రదేశం నుంచి 152 యార్డ్స్ దూరంలో ట్రంప్ మాట్లాడుతున్నారు. విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×