EPAPER

Donald Trump: బైడెన్‌కు ట్రంప్ సవాల్.. ఆటలో గెలిస్తే మిలియన్ డాలర్లు !

Donald Trump: బైడెన్‌కు ట్రంప్ సవాల్.. ఆటలో గెలిస్తే మిలియన్  డాలర్లు !

Donald Trump Challenges Biden: ప్రపంచ దేశాల దృష్టంతా ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అమెరికా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ, ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్, ట్రంప్.. జో బైడెన్ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్, తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మరో సవాల్ విసిరారు. తనతో గోల్ఫ్ ఆడటానికి సిద్ధమా అంటూ ఫోరిడాలో నిర్వహించిన ఓ సభలో సవాల్ విసిరారు.


బైడెన్‌కు తనను తాను నిరూపించుకునే అవకాశం ఇస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. తనతో గోల్ఫ్ మ్యాచ్‌ను ఆడేందుకు రావాలంటూ 81 ఏళ్ల బైడెన్‌కు 78 ఏళ్ల ట్రంప్ సవాల్ విసిరారు. గోల్ఫ్ మ్యాచ్‌ ఆడాలని సవాల్ విసురుతున్నానని.. ఒక వేళ బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు తాను ఒక మిలియన్ డాలర్లు విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ సారి పోటీ తనకు, బైడెన్‌కు నేరుగా ఉంటుందని అన్నారు. మ్యాచ్ ఎక్కడ జరగాలో బైడెన్ చెప్పాలని తెలిపారు.

ఆటలు ఆడేందుకు బైడెన్ ఖాళీగా లేరు:
ఇదిలా ఉంటే ట్రంప్ సవాల్‌ను బైడెన్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పే సమయం బైడెన్‌కు లేవని తెలిపారు. బైడెన్ అమెరికాను నడిపించడంలో, స్వేచ్ఛా ప్రపంచాన్ని రక్షించడంలో బిజీగా ఉన్నారని అన్నారు. అంతే కాకుండా ఆటలు ఆడేందుకు ఖాళీగా లేరని తెలిపారు. ట్రంప్ అబద్ధాల కోరు అని, దోషి అని, మోసగాడు అని ఆయనకు ఇలాంటివి తప్ప వేరే పనులు లేవంటూ ఆరోపించారు.


బైడెన్‌కు ఆమె బీమా పాలసీ:
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్ బైడెన్‌కు ఆమె బీమా పాలసీగా అభివర్ణించారు. ఇటీవల అధ్యక్ష అభ్యర్థి మార్పిడిపై డెమొక్రటిక్ పార్టీలో చర్చ మొదలైంది. నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో బైడెన్‌ను మెచ్చుకోవచ్చని తెలిపారు. కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం బైడెన్‌ జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అని అన్నారు. బైడెన్ కు అదే బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తెలిపారు. కమలా హారిస్‌కు ప్రభుత్వంలో రెండు కీలక అంశాలు అప్పజెప్పాలన్నారు. అందులో ఒకటి ఒకటి బార్డర్ సెక్యూరిటి కాగా రెండోది రష్యాను భయపెట్టి ఉక్రెయిన్ పై దాడి ఆపేలా చేయడం అని అన్నారు.

Also Read: భారత్, ఆస్ట్రియా స్నేహం మరింత బలపడనుంది.. ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ

రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదన్నారు. జూన్ 27 న అట్లాంటాలో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ పేలవ ప్రదర్శనను కనబరిచారు. ఆ తర్వాత సొంత పార్టీ సహచరులు కూడా బైడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఇదిలా  ఉంటే అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగాలని డిమాండ్ ను బైడన్ తిరస్కరించారు. ఇప్పటికే బైడెన్ అధ్యక్ష పదవికి అర్హుడు కాదని తేలిపోయిందని ట్రంప్ అన్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×