EPAPER

Donald Trump angry: ఒలింపిక్స్ ప్రారంభోత్సవంపై కోపంలో ట్రంప్.. ఎందుకు?

Donald Trump angry: ఒలింపిక్స్ ప్రారంభోత్సవంపై కోపంలో ట్రంప్.. ఎందుకు?

Donald Trump on Paris Olympics(Today’s international news): అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వెనుకబడ్డారా? డెమోక్రటిక్ పార్టీ తరపున కమలాహారిస్ బరిలోకి దిగడంతో ఆయన ఆలోచనలో పడ్డారా? ఏదో విధంగా మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారా? అందుకే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు అమెరికా ప్రజల మదిలో రేకెత్తిస్తున్నాయి.


డెమోక్రటిక్ పార్టీ తరపున కమలాహారిస్ అధ్యక్ష బరిలోకి దిగారు. ఆ పార్టీ నేతలంతా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు ట్రంప్- కమలాహారిస్‌కు మధ్య ప్రజల మద్దతు కేవలం ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది. దీంతో వివాదాస్పద అంశాలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఎందుకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు? వేడుకల్లో ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన లాస్ట్ సప్పర్ పెయింట్ నేపథ్యంలో ఓ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన ఓ వర్గంవారిని కించపరిచినట్టు ఉందనే విమర్శలు లేకపోలేదు. డ్యాన్స్‌ల్లో డ్రాగ్ క్వీన్‌లు డీజేలు వివిధ భంగిమల్లో ఇచ్చిన ప్రదర్శనలో లాస్ట్ సప్పర్‌ను గుర్తు చేసేలా వుందనేది అసలు పాయింట్.


ALSO READ: విదేశాల్లో 633 మంది ఇండియన్ స్టూడెంట్స్ మృతి.. ఆ దేశాల్లోనే అత్యధికం

దీన్ని క్యాథలిక్, ఫ్రెండ్ బిషప్‌లు తీవ్రస్థాయిలో ఖండించారు. పలు క్రిస్టియన్ సంఘాలు సైతం తప్పు బట్టాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలోపడ్డారు ట్రంప్. తనది ఓపెన్‌గా మాట్లాడే మనస్తత్వమని, పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలోని కార్యక్రమాలు అవమానకరంగా ఉన్నాయన్నారు.

ఈ వ్యవహారంపై ఒలింపిక్స్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. మతానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీక రించే ఉద్దేశం తమకు లేదన్నారు. శాంతి, పునరుజ్జీవం అనే థీమ్‌తో రూపొందించామన్నారు. 2028లో లాస్‌ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఇలాంటి ప్రదర్శన ఉండదన్నారు. ప్రస్తుతానికి ఒలింపిక్ ఓపెనింగ్ వేడులక వివాదం సద్దుమణిగిందనే చెప్పవచ్చు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×