EPAPER

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి?.. ఇజ్రాయెల్ లాంటి యాంటి మిసైల్ టెక్నాలజీ మన దెగ్గర ఉందా?

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి?.. ఇజ్రాయెల్ లాంటి యాంటి మిసైల్ టెక్నాలజీ మన దెగ్గర ఉందా?

India’s Iron Dome| ఇజ్రాయెల్ పై ఇరాన్ ఇటీవల 200 క్షిపణుల (మిసైల్స్)తో దాడి చేసింది. అయితే అత్యాధునిక యాంటి మిసైల్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. శత్రువులు క్షిపణులతో దాడి చేసినా ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఆ క్షిపణులతో గాల్లో పేల్చేస్తుంది. ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్ లాంటి ఇతర యాంటి మిసైల్ సిస్టమ్స్ ఉన్నా.. ఇరాన్ ఈసారి ప్రయోగించిన హైపర్ సోనిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగంపై విధ్యంసం సృష్టించాయి. కేవలం ప్రయోగించిన 12 నిమిషాల్లో ఇరాన్ నుంచి బయలుదేరి ఇజ్రాయెల్ భూభాగంపై టార్గెట్ వరకు ఈ హైపర్ సోనిక్ మిసైల్స్ చేరుకున్నాయని ఇరాన్ అధికారులు తెలిపారు.


అంటే ఈ సారి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సమర్థవంతంగా పనిచేయలేదు. ఈ విషయం ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. ఇరాన్ వద్ద మూడు యాంటి మిసైల్ డిఫెన్స్ పరికరాలున్నాయి. షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్, మీడియం రేంజ్ యాంటి మిసైల్ టెక్నాలజీ అయిన డేవిడ్స్ స్లింగ్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ని అడ్డుకునే ది ఆరో సిస్టమ్. ఈ మూడు కూడా బాలిస్టిక్ మిసైల్స్, హైపర్ సోనిక్ మిసైల్స్ లాంటి వివిధ రకాల క్షిపణులను గాల్లోనే అడ్డుకునేందకు తయారు చేయబడ్డాయి. కానీ తాజాగా ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగంపై విజయవంతంగా పడడంతో ఈ యాంటి మిసైల్ సిస్టమ్స్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి.

ముఖ్యంగా ఇండియా లాంటి దేశానికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందకంటే భారతదేశానికి ఇరువైపులా శత్రుదేశాలున్నాయి. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. అయితే ఇండియా వద్ద ఇలాంటి యాంటి మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానం అవును ఉన్నాయి. ఇండియా సొంతంగా అభివృద్ది చేసిన యాంటి మిసైల్ టెక్నాలజీ పృథ్వి, అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాలిస్టిక్ మిసైల్స్ ని అడ్డుకుంటాయి. అలాగే భారత్ సొంత టెక్నాలజీ ఆకాష్, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 యాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ బాలిస్టిక్ మిసైల్స్ తో పాటు హైపర్ సోనిక్ మిసైల్స్ ని కూడా అడ్డుకోగలవు.


Also Read: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

ఇండియా వద్ద ఉన్న యాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను పూర్తిస్థాయిలో ఇంకా వినియోగించలేదు. వాటిని భారత సైన్యం పరీక్షిస్తూనే ఉంది. అయితే ఇజ్రాయెల్ పై తాజాగా జరిగిన మిసైల్ దాడితో ఈ యంటి మిసైల్స్ సిస్టమ్స్ సామర్థ్యంపై సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హైపర్ సోనిక్ మిసైల్స్ తో శత్రు దేశాలు దాడిచేస్తే.. ఈ యాంటి డిఫెన్స్ సిస్టమ్స్ సమర్థవంతంగా పనిచేయడం లేదని తేలుతోంది. ఎందుకంటే ఈ హైపర్ సోనిక్ మిసైల్స్ గాల్లో చాలా వేగంగా ప్రయాణిస్తాయి.. ఆ సమయంలో ఈ యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని ట్రాక్ చేసి టార్గెట్ చేయడం అంత సులువు కాదు. ఇజ్రాయెల్ విషయంలో అదే జరిగింది.

భారతదేశం పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్.. ఇద్దరి వద్ద అడ్వాన్సడ్ మిసైల్స్ ఉన్నాయి. వీటితో ఇండియాకు ప్రమాదమే. ముఖ్యంగా చైనా హైపర్ సోనిక్ మిసైల్స్ ని తయారు చేస్తోంది. ఇవి సుదూరంగా ఉన్న టార్గెట్లను సైతం అందుకోగలవు. ఈ అడ్వాన్సడ్ హైపర్ సోనిక్ మిసైల్స్ తో భారత దేశానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. పాకిస్తాన్ వద్ద అడ్వాన్సడ్ హైపర్ సోనిక్ మిసైల్స్ లేకపోయినా చైనాతో దోస్తీ కారణంగా పాకిస్తాన్ కు వాటిని పొందడం అంత సమస్య ఏమీ కాదు.

ఇప్పుడు ఇండియాకు వెంటనే ఈ అడ్వాన్సడ్ హైపర్ సోనిక్ మిసైల్స్‌ను ఎదుర్కొనే యాంటి మిసైల్ డిఫెన్స్ చాలా అవసరం. ప్రస్తుతమున్న యాంటి మిసైల్ డిఫెన్స్ పరికరాలపై ఆధారపడితే లాభం లేదు. అందుకే దేశ భద్రత కోసం డిఫెన్స్ రంగంలో ఇండియా నిరంతర పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.

Related News

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

Israel Iran War: ‘నెతన్యాహు ఒక హిట్లర్.. యద్ధం ఆపేందుకు ఇండియా సాయం చేయగలదు’.. ఇరాన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Big Stories

×