EPAPER

Deep Fake Video: ఇటలీ ప్రధాని డీప్ ఫేక్ వీడియో.. రూ. 90 లక్షలు డిమాండ్

Deep Fake Video: ఇటలీ ప్రధాని డీప్ ఫేక్ వీడియో.. రూ. 90 లక్షలు డిమాండ్
deep fake video
deep fake video

Deep Fake Video:ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలోని సినీ ఇండస్ట్రీ నుండి మొదలుకుని రాజకీయ నేతలతో సహా డీప్ ఫేక్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తొలుత హీరోయిన్ రష్మిక మందనా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ప్రధాని సహా పలు రాష్ట్రాల సీఎంల డీప్ ఫేక్ వీడియోలు కూడా చర్చకు దారి తీశాయి. తాజాగా ఇటలీ ప్రధాని కూడా డీప్ ఫేక్ బారిన పడక తప్పలేదు.


ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని డీప్ ఫేక్ బారిన పడింది. తన ఫోటోలను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సహాయంతో మిస్ యూజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎస్ పోర్నో గ్రాఫిక్ వెబ్ సైట్లో తన ఫోటోలతో వీడియో పెట్టారని.. దీనికి నష్ట పరిహారంగా €100,000(ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 90 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేసింది. తన ప్రతిష్టకు భంగం కలిగించారని, ఈ ఘటనకు పాల్పడినందుకు తప్పక భరణం కింద తాను అడిగిన డబ్బును చెల్లించాలని కోరింది.

బీబీసీ రిపోర్ట్ ప్రకారం, జార్జియాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి పీఎం మెలోనికి సంబంధించిన ఫోటోలను డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీటిని అప్లోడ్ చేసిన తర్వాత దాదాపు కోట్ల మంది చూశారని పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారంలో అతడి 70 ఏళ్ల తండ్రి కూడా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి.. స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియోలు అప్ లోడ్ చేసినట్లు కనిపెట్టారు. దీంతో నిందితులైన తండ్రికొడుకులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో జార్జియా భారీ నష్ట పరిహారాన్ని కోరింది. ఏకంగా లక్ష యూరోలు చెల్లించాలని డిమాండ్ చేసింది.


అయితే ఇటలీ ప్రధాన మంత్రి బాధ్యతల స్వీకరించకముందే(2022) జార్జియా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటలీలో నష్టపరిహారం కేసులను నేరాభియోగ కేసులుగా చూస్తారు. ఇటువంటి కేసుల్లో నిందితులూన వానికి 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే ఈ డీప్ ఫేక్ కేసులో ఈ ఏడాది జూలై 2వ తేదీన ప్రధాని జార్జియా మెలోని కోర్టులో హాజరుకానున్నారు.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×