EPAPER
Kirrak Couples Episode 1

Cryptocurrency : క్రేజ్ కోల్పోయిన క్రిప్టో.. కంపెనీల ప్లాన్..

Cryptocurrency  : క్రేజ్ కోల్పోయిన క్రిప్టో.. కంపెనీల ప్లాన్..
Cryptocurrency

Cryptocurrency : సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఈరోజు ఉన్న టెక్నాలజీకు ఉన్నంత క్రేజ్.. రేపు ఉండదు. ఏవో కొన్ని టెక్నాలజీస్ మాత్రమే ఎప్పటికీ యూజర్లు ఆకర్షిస్తూ మార్కెట్లో కొనసాగుతాయి. అలాగే క్రిప్టో కరెన్స్ క్రేజ్ కూడా రోజురోజుకీ తగ్గిపోతోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గతేడాది క్రిప్టో భారీ పతనాన్ని చూసిందని సర్వేలో తేలింది.


డిజిటల్ పేమెంట్స్ అనేది ప్రపంచంలో ఊపందుకున్న తర్వాత.. డిజిటల్ కరెన్సీ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీని క్రేజ్‌ను క్యాచ్ చేసిన కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా డిజిటల్ కరెన్సీను తయారు చేయడం మొదలుపెట్టాయి. కానీ కొంతకాలంలోనే దీని క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. 2022లో డిజిటల్ కరెన్సీ తయారీ చాలావరకు నష్టాల్లోనే సాగిందని సర్వేలో బయటపడింది. అందుకే క్రిప్టో కరెన్సీ కంపెనీలు వెంటనే జాగ్రత్తపడ్డాయి.

మార్కెట్లో తమ రోల్‌ను మెరుగుపరుచుకోవడానికి క్రిప్టో కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెన్యూవబుల్ ఎనర్జీతో సంబంధాలు పెట్టుకోవడం క్రిప్టో కరెన్సీ క్రేజ్ మళ్లీ పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. వాతావరణంపై ప్రభావం చూపించే ఎనర్జీ రంగంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల నష్టాలు ఉంటాయేమో అన్న అనుమానాలు కూడా క్రిప్టో కంపెనీల్లో మొదలయ్యాయి. ఇప్పటికే క్లైమెట్ విలన్‌గా క్రిప్టో కరెన్సీకు పేరు కూడా ఉంది.


కంప్యూటర్లను గంటలు గంటలు విరామం లేకుండా నడిపించడం, మైనింగ్ చేయడం లాంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాత క్రిప్టో కరెన్సీ చేతికి వస్తుంది. అందుకే వాతావరణంపై క్రిప్టో కరెన్సీ తయారీ ప్రభావం పడుతుందని ఇప్పటికే పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. 2022లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. 2022 ఆగస్ట్‌లో క్రిప్టో తయారీ కోసం గంటకు 240 బిలియన్ కిలోవాట్స్ కరెంటు ఉపయోగపడిందని తెలుస్తోంది. ఇది అర్జెంటీనా ఏడాది పూర్తిగా ఉపయోగించే కరెంటు కంటే ఎక్కువ.

అమెరికాలో ఉపయోగిస్తున్న కరెంటు మొత్తంలో 0.9 నుండి 1.7 శాతం క్రిప్టో కరెన్సీ తయారీకే పోతుందని రిపోర్టులో తేలింది.
అందుకే అమెరికాలోని పలు రాష్ట్రాలు దీనిపై ఆంక్షలు విధించాయి. రెన్యూవబుల్ ఎనర్జీతో మాత్రమే దీని తయారీకి అనుమతిస్తామని తెలిపాయి. క్రిప్టో క్రేజ్ తగ్గుతూ ఉండడంతో కంపెనీలు కూడా రెన్యూవబుల్ ఎనర్జీనే ఉపయోగించడానికి సిద్ధమయ్యాయి. ఈ కొత్త ప్రక్రియతో అయినా.. క్రిప్టో క్రేజ్ మళ్లీ పెరుగుతుందేమో చూడాలి.

Tags

Related News

Chinese Rocket: ల్యాండింగ్ సమయం.. ఒక్కసారిగా పేలిన చైనా రాకెట్

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Sri Lanka: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

Man Wins Energy Drink Lottery: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

Pakistan Diplomat Convoy: పాకిస్తా‌న్ లో రష్యా, ఇరాన్ సహా 12 మంది డిప్లమాట్స్ పై బాంబు దాడి.. పోలీస్ ఆఫీసర్ మృతి

PM Narendra Modi: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Big Stories

×