EPAPER

Congo Boat Capsized 86 People Killed: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..

Congo Boat Capsized 86 People Killed: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..

Congo boat capszed 86 Killed: కాంగోలో విషాదం చోటు చేసుకుంది. ఓ పడవ బోల్తా పడిన ఘటనలో దాదాపు 86 మంది మృతి చెందారు. వంద మందికి పైగానే ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఆ దేశ చరిత్రలో అతి పెద్దది. అసలు ఏమైంది?


కాంగో రాజధాని కిన్షాకు సమీపంలోవున్న ఓ నదిలో బోటు ట్రావెల్ చేస్తోంది. అసలే నాటు పడవ, పదుల సంఖ్యలో ఎక్కాల్సిన ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కేశారు. ఎంతమందంటే దాదాపు 270 మంది అందులో ప్రయాణిస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా ఇంజన్‌లో సమస్య తలెత్తింది. దీని కారణంగా పడవ బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 86 మంది స్పాట్‌లో చనిపోయారు. వారంతా ఈత రానివారు. మరో 185 మంది ఒడ్డుకు ఈదుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది అధికారులు చెబుతున్న వెర్షన్.

కాంగో పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తు కొస్తాయి. అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. నదుల కారణంగా సరైన రోడ్డు వ్యవస్థ కూడా లేదు. అందుకే అక్కడి ప్రజలు నాటు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో పడవలు బోల్తా పడి పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.


ALSO READ: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

అసలు ఇంజన్ పాడైపోతే పడవ ఆగిపోతుంది. కానీ బోల్తా పడిన ఘటనలు లేవని అంటున్నారు. ప్రమాదం సమయంలో బోటులో ఏమైనా గొడవ జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇంతకీ ఈ బోటు ప్రయాణికులను తీసుకుని వెళ్తుందా? లేక పొరుగు దేశం ఎవరైనా వలస వస్తున్నారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

 

 

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×