EPAPER

China Scientists Create Deadly Virus: చైనాలో మరో కొత్త వైరస్‌.. సోకితే 3 రోజుల్లోనే మరణం

China Scientists Create Deadly Virus: చైనాలో మరో కొత్త  వైరస్‌.. సోకితే 3 రోజుల్లోనే మరణం

China Scientists Create Deadly Virus in Lab(International news in telugu): 2020లో కరోనా మహమ్మారి ప్రపంచమంతా వణికించింది. ఈ వైరస్ తో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి చైనాలోని వుహాన్ ల్యాబ్ నుండి కరోనా వైరస్ ఉద్భవించిందని చెప్పారు.. కాని చైనా మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పైగా ఈ విషయం పై ఖండించింది కూడా..  ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి బయటపడుతుండగా తాజాగా మరో భయంకరమైన విషయం ప్రజల్లో ఒణుకుపుట్టిస్తోంది. ఇప్పుడు మరోసారి చైనా కొత్త వైరస్‌ను సృష్టించినట్లు తెలుస్తోంది. అవును.. ప్రపంచాన్ని నాశనం చేసిన కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అని చెప్పుకునే చైనాలో మరో వైరస్ గురించి చర్చ మొదలైంది.


తాజాగా చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కేవలం మూడు రోజుల్లోనే ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్‌ను సిద్ధం చేశారు. ‘సైన్స్ డైరెక్ట్’ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఎబోలా వైరస్‌ను అనుకరించేందుకు శాస్త్రవేత్తలు సింథటిక్ వైరస్‌ను ఉపయోగించినట్లు సమాచారం. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకు హెల్త్‌చైనీస్ శాస్త్రవేత్తలు కొత్త వైరస్ ఎబోలాను సృష్టించినట్లు తెలుస్తోంది. ఎబోలా వైరస్‌ను పోలిన ఈ కొత్త సింథటిక్ వైరస్‌ను ఇటీవల దాదాపు 10 చిట్టెలుకలపై పరీక్షించారు. టీకా వేసిన 3 రోజుల తర్వాత చిట్టెలుకలలో తీవ్రమైన లక్షణాలు కనిపించడం ప్రారంభించాయని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: గాయాలు మానినా పుండు మానలేదు.. కరోనాపై కళ్లు బైర్లు కమ్మే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ


మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మూడు రోజుల్లోనే మృతి చెందినట్లు సమాచారం. ఈ చిట్టెలుకలు చనిపోయిన తర్వాత, పరిశోధకులు వాటి అవయవాలను పరిశీలించగా.. వైరస్ ను వాటి శరీరంలోకి పంపించినప్పుడు చిట్టెలుక కళ్లకు ఇన్ఫెక్షన్ సోకిందని, దాని కారణంగా వాటి దృష్టి బలహీనంగా మారిందని గమనించారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేగులు, మెదడు వంటి కణజాలాలలో వైరస్ పేరుకుపోతుందని.. ఎబోలా వైరస్ లాగా ఇది శరీరంలోని కణాలకు సోకుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ప్రస్తుతం ఈ వైరస్ వల్ల ప్రయోజనాలు, ఇంకా ఎలాంటి ప్రాణహాని కలుగుతుందోనని సర్వత్రా తీవ్ర చర్చ మొదలైంది. ఈ భయంకరమైన వైరస్ బారి నుండి విరుగుడు కనిపెట్టేందుకు అగ్రరాజ్య శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 నుంచి 2016 మధ్యకాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కల్పోయారు.

 

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×