EPAPER
Kirrak Couples Episode 1

China Resumes Nuclear Test : మళ్లీ అణు పరీక్షలు ప్రారంభించిన చైనా? భారతపై దీని ప్రభావం ఏంటి?

China Nuclear Test : భారత్‌తో సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా కొత్త తరం అణ్వాయుధాలను పరీక్షించేందుకు సిద్ధమైంది. రిమోట్ వెస్ట్రన్ ఎడారిలో ఉన్న తన పాత అణు పరీక్షా స్థావరం వద్ద చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది.

China Resumes Nuclear Test : మళ్లీ అణు పరీక్షలు ప్రారంభించిన చైనా? భారతపై దీని ప్రభావం ఏంటి?

China Resumes Nuclear Test : భారత్‌తో సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా కొత్త తరం అణ్వాయుధాలను పరీక్షించేందుకు సిద్ధమైంది. రిమోట్ వెస్ట్రన్ ఎడారిలో ఉన్న తన పాత అణు పరీక్షా స్థావరం వద్ద చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆసియా దిగ్గజ దేశం అయిన చైనా 1964లో జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని లోప్ నూర్ టెస్టింగ్ సైట్‌లో తన మొదటి అణు బాంబును పేల్చింది. ఇప్పుడు, న్యూయార్క్ టైమ్స్ (NYT) నివేదికలో ప్రచురించిన ఉపగ్రహ చిత్రాలు.. బంజరు జిన్‌జియాంగ్ ప్రాంతంలోని సైనిక స్థావరంలో నిర్మాణ కార్యకలాపాలను వెల్లడించాయి. చైనా కొత్త అణు పరీక్షలకు సిద్ధమవుతోందని విశ్లేషకులు భయపడుతున్నారు. అయితే, బీజింగ్ ఈ వాదనలను తోసిపుచ్చింది.


మాక్సార్ టెక్నాలజీ.. లూప్ నర్ ఉపగ్రహ చిత్రాలు ఇటీవల డ్రిల్లింగ్ రిగ్ ద్వారా డ్రిల్ చేసిన లోతైన నిలువు షాఫ్ట్‌‌లను చూపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, షాఫ్ట్ మైలులో కనీసం మూడింట ఒక వంతు (సుమారు 1760 అడుగులు) లోతులో ఉండొచ్చని తెలిపింది. లూప్ నర్ టెస్ట్ బేస్ ప్రాంతంలోని జెయింట్ ఎయిర్‌బేస్ కూడా అప్‌గ్రేడ్ చేశారు. అయితే అక్కడ లోతైన నిలువు షాఫ్ట్‌లు కూడా పెరిగాయి. అమెరికన్ వార్తాపత్రిక ప్రకారం, గత అణ్వాయుధ పరీక్షల కోసం పర్వతాల వైపు డ్రిల్లింగ్ చేసిన సమాంతర సొరంగాలలో కనీసం ఒకదానిలో ఇటీవలి త్రవ్వకం,నిర్మాణ సూచనలు ఉన్నాయి.

లోప్ నూర్ టెస్ట్ బేస్ వద్ద కొత్త రోడ్లు, విద్యుత్ లైన్లు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ కూడా ఉన్నాయని ఉపగ్రహ నిఘాలో నిపుణుడు రెన్నీ బాబియార్జ్, న్యూయార్క్ టైమ్స్‌కి చెప్పారు. డాక్టర్ బాబియార్జ్, మాజీ పెంటగాన్ విశ్లేషకుడు, కొత్త చిత్రాలను వెలికితీసి పరిశీలించారు.


చైనా ఉద్దేశం ఏమిటి?

లోప్ నూర్ సిగ్నల్స్ వద్ద పునరుద్ధరణ,విస్తరణ పనులు చూస్తే చైనా పూర్తి స్థాయి అణు పరీక్షలు లేదా సబ్‌క్రిటికల్ ప్రయోగాలను నిర్వహించడానికి సిద్ధమవుతోందని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ టెస్ట్ బ్యాన్ ఒప్పందం ప్రకారం అనుమతించిన ఈ సబ్‌క్రిటికల్ పరీక్షలు.. అణు విస్ఫోటనానికి జరగకుండా తక్కువ ప్రభావం చూపే ప్రయోగాలని చెప్పొచ్చు.

1990 నుంచి ప్రపంచంలోని అణు శక్తులు పరీక్షలపై స్వచ్ఛంద తాత్కాలిక నిషేధానికి అంగీకరించింది చైనా. అప్పటి నుండి బీజింగ్ పూర్తి స్థాయి అణు పరీక్షలను నిర్వహించలేదు. అయితే, చైనా త్వరలో అణు పరీక్షను నిర్వహించే యోచనలో ఉందని అణు నిపుణులు విశ్వసించడం లేదు. దాని చర్యలు దాని ప్రత్యర్థులపై ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆధారపడి ఉండవచ్చు.

కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో అణు నిపుణుడు టోంగ్ జావో న్యూయార్క్ టైమ్స్‌తో, అన్ని సాక్ష్యాలు చైనా అణు పరీక్షలను పునఃప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నాయని సూచిస్తున్నాయని తెలిపారు. లోప్ నూర్ గురించి వచ్చిన వార్తలు పూర్తిగా బాధ్యతారాహిత్యం అని బీజింగ్ పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ NYTకి ఒక ప్రకటనలో తెలిపింది.

అణ్వాయుధాల నిల్వలను విస్తరిస్తున్న చైనా!

గత ఏడాది కాలంగా చైనా తన అణు నిల్వలను బాగా విస్తరించిందని అక్టోబర్‌లో అమెరికా పేర్కొంది. 2030 నాటికి చైనా తన ఆయుధ సంపత్తిని 1,000 కంటే ఎక్కువ వార్‌హెడ్‌లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని పెంటగాన్ వార్షిక నివేదిక పేర్కొంది. రష్యా, యుఎస్ ఆయుధాల కంటే ఇది ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది, రష్యా 5,889 వార్‌హెడ్‌లను కలిగి ఉంది, యుఎస్ 5,244 వార్‌హెడ్‌లను కలిగి ఉందని BBC నివేదించింది.

బీజింగ్ “నో-ఫస్ట్-స్ట్రైక్” అణు విధానానికి కట్టుబడి ఉందని పెంటగాన్ నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, మరొక నివేదిక చైనా అణ్వాయుధాలు పెరుగుతున్నాయని గుర్తించింది.
చైనా 10 సంవత్సరాల క్రితం దాదాపు 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది. ఇప్పుడు, చైనీస్ మిలిటరీ వ్యూహాత్మక విభాగం అయిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ 2028 నాటికి 1,000 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణి లాంచర్‌లను మోహరించడానికి ట్రాక్‌లో ఉందని ఒక నివేదిక తెలిపింది.

భారత్, అమెరికాపై దీని ప్రభావం ఏమిట?

గత కొన్ని సంవత్సరాలుగా చైనాతో సరిహద్దల వద్ద ఉద్రిక్త సంబంధాలు ఉండడంతో భారత్‌పై దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. చైనా కంటే చాలా తక్కువ నిల్వలు ఉన్న భారతదేశం, 1998 పోఖ్రాన్ పరీక్షల తర్వాత అణు పరీక్షలపై ఏకపక్షంగా మారటోరియం ప్రకటించింది. లాప్ నూర్ శ్రేణిని తిరిగి క్రియాశీలం చేయడానికి ఏదైనా చైనా ప్రయత్నం చేస్తే భారత్ ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

తైవాన్ కారణంగా అమెరికా, చైనాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చైనాతో సంబంధాలు మెరుగుపరిచేందుకు దృష్టి సారిస్తున్నారు. కానీ చైనా అమెరికాను లెక్కచేయడం లేదు.
లాప్ నార్ వద్ద అణు కార్యకలాపాలు చైనా ప్రారంభించడంతో మళ్లీ అమెరికా సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related News

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Big Stories

×