EPAPER

Chile Forest Fire : చిలీ అడవుల్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం..

Chile Forest Fire : చిలీ అడవుల్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం..

Chile Forest Fire : చిలీ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 46 మంది చనిపోగా.. వేలాది ఇళ్లు అగ్నికీలల్లో ఆహుతైనట్లు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అడవుల్లో నిరంతరం ఈ భయంకరమైన మంటలు వ్యాపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా చిలీలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు.


చిలీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్ హీట్)కు చేరుకుందని.. ఈ పరిస్థితే అడవులలో రగులుతున్న కార్చిచ్చుకు కారణమైందని ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయన హెలికాఫ్టర్ ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

చిలీ అంతర్గతమంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దేశంలోని మధ్య, దక్షిణాన 92 అడవులు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నానికి సుమారు 43వేల హెక్టార్ల వరకూ అడవిప్రాంతం దగ్ధమైందని వెల్లడించారు. అడవులలో కార్చిచ్చు పెరుగుతున్న కారణంగా.. చిలీ ప్రభుత్వం మధ్య, దక్షిణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.


చిలీ అడవుల్లో అగ్నిప్రమాదాలు సాధారణం. ఇక్కడ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడల్లా.. డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. అగ్నిప్రమాదం వల్ల వందలాది కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ప్రస్తుతం బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సెంట్రల్ చిలీలో దాదాపు పది లక్షల మంది నివాసితులైన వాల్‌పరైసో ప్రాంతంలోని అనేక ప్రాంతాలపై నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడుతోంది. అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లు, ట్రక్కులను ఉపయోగించి మంటలను ఆర్పడానికి చాలా కష్టపడుతున్నారు.

తీర ప్రాంత పర్యాటక నగరమైన వినా డెల్ మార్ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు అన్ని ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి కష్టపడుతున్నాయని చిలీ అధికారులు తెలిపారు. గడిచిన దశాబ్దకాలంలో సంభవించిన అటవీ అగ్నిప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోరమైన ప్రమాదమని చిలీ విపత్తు ఏజెన్సీ సెనాప్రెడ్ తెలిపింది.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×