EPAPER

Miss Universe Nigeria: మిస్ యూనివర్స్ నైజీరియాగా చిడిమ్మా అడెత్‌షీనా.. కిరీటం ధరించిన వివాదాల సుందరి!

Miss Universe Nigeria: మిస్ యూనివర్స్ నైజీరియాగా చిడిమ్మా అడెత్‌షీనా.. కిరీటం ధరించిన వివాదాల సుందరి!

Miss Universe Nigeria| సౌత్ ఆఫ్రికా అందాల పోటీల్లో వివాదాస్పదంగా వైదొలిగిన తరువాత తన పౌరసత్వంపై విచారణ ఎదుర్కొంటున్న చిడిమ్మా అడెత్‌షీనా ఏకంగా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎంపికైంది. బిబిసి మీడియా కథనం ప్రకారం.. చిడిమ్మా తండ్రి నైజీరియా కు చెందిన వాడు. ఆయన దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. ఈ కారణంగా మిస్ సౌత్ ఆఫ్రికా బ్యూటీ కాంటెస్ట్ లో ఫైనల్ వరకు వెళ్లిన చిడిమ్మాను.. నైజీరియన్లకు సౌత్ ఆఫ్రికా పోటీల్లో పాల్గొనే అర్హత లేదని విమర్శలు కారణంగా ఫైనల్ రౌండ్ లో పోటీల నుంచి తొలగించారు. ఈ ఘటన జూలై 2024లో జరిగింది.


చిడిమ్మా తల్లి దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉన్నా.. ఆమె కూడా మరో దేశం నుంచి వలస వచ్చి స్థిరపడ్డారని ఆరోపణలున్నాయి. ఈ విషయం వివాదాస్పదం కావడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆగస్టు మొదటివారంలో చిడిమ్మా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇన్స్‌టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ లో తన కుటుంబానికి దక్షిణాప్రికాలో ప్రమాదముందని కారణం చూపుతూ.. తాను అందాల పోటీ నుంచి స్వతహాగా వైదొలుగుతున్నట్లు తెలిపింది. అయితే మరోసటి రోజే ఆమెకు మిస్ యూనివర్స్ నైజీరియా అందాల పోటీ నిర్వహకుల నుంచి పిలుపు వచ్చింది. ఆమె తన తండ్రి పుట్టిన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశముందని వారు తెలపడంతో చిడిమ్మా.. నైజీరియా పోటీల్లో పాల్గొనింది.

అయితే శనివారం రాత్రి జరిగిన మిస్ యూనివర్స్ నైజీరియా ఫైనల్ రౌండ్ లో చిడిమ్మా అడెత్ షీనా పేరు విన్నర్ గా ప్రకటించగానే ఆమె తన భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయింది. తన తలపై మిస్ యూనివర్స్ నైజీరియా కిరీటం పెట్టే సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ”ఈ కిరీటం కేవలం తన అందం కోసం కాదని.. ఐక్యతకు పిలుపు కూడా” అని గట్టిగా అరిచింది.


మిస్ యూనివర్స్ నైజీరియా పోటీల్లో విజయం సాధించిన తరువాత 23 ఏళ్ల చిడిమ్మా ఇన్స్‌టాగ్రామ్ లో తన విజయం గురించి వివరంగా ఓ పోస్ట్ చేసింది. ”అందాల పోటీల కోసం నా ప్రయాణం చాలా అద్బుతంగా సాగింది. మిస్ యూనివర్స్ నైజీరియా కిరీటం గెలుచుకోవడం ఒక కల నిజం కావడమే. ఈ కిరీటం ధరించడం చాలా గౌరవంగా అనిపిస్తోంది. ఈ ఆనంద సమయంలో నా మనసులో ఎప్పటి నుంచో దహించుకుపోతున్న ఒక విషయం అందరికీ చెప్పాలి. ఆఫ్రికన్లంతా ఐక్యంగా ఉండాలి, శాంతియుతంగా కలిసి మెలిసి ఉండాలనే నా ఆలోచన. ఆఫ్రికా దేశాలను విభజించే అడ్డంకులను మనమందరం తొలగించాలి. ప్రతి ఆఫ్రికన్ ఈ ఖండంలో స్వతంత్రంగా తిరిగాలి, ఆఫ్రికా ఖండం అభివృద్ధి కోసం మనమంతా పాటు పడాలి,” న్యాయ విద్య అభ్యసిస్తున్న ఈ సుందరి భావోద్వేగంగా రాసింది.

స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం.. చిడిమ్మా అదెత్ షీనా సొవేటో లో ఒక నైజీరియా తండ్రికి, సౌత్ ఆఫ్రికా మొజాంబికన్ తల్లికి జన్మించింది. ఆమె బాల్యం అంతా రాజధాని నగరం కేప్ టౌన్ లో సాగింది. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం 1995 తరువాత దేశంలో జన్మించిన అందరికీ పౌరసత్వం ఇస్తోంది.

అయితే ఆమె మిస్ సౌత్ ఆఫ్రికా పోటీల్లో పాల్గొన్న సమయంలో తీవ్ర వివక్ష కు గురైంది. ఆ సమయంలో తనకు మద్దతుగా ఉన్న సౌత్ ఆఫ్రికన్లకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. నవంబర్ లో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఆమె నైజీరియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

Also Read:  బ్రెజిల్ లో సోషల్ మీడియా ‘ఎక్స్’ పై నిషేధం.. మస్క్‌పై న్యాయమూర్తి పగబట్టారా?

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×