EPAPER

Sam Altman Returns : ఓపెన్ ఏఐ పగ్గాలు తిరిగి శామ్‌కే!

Sam Altman Returns : ఓపెన్ ఏఐ పగ్గాలు తిరిగి శామ్‌కే!

Sam Altman Returns : ఓపెన్ ఏఐలో రేగిన కల్లోలం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎలాంటి నోటీసు లేకుండా తనకు ఉద్వాసన పలికిన బోర్డు‌రూం కుట్రలను ఛేదించి ఏఐ కింగ్ శామ్ ఆల్ట్‌మన్ సొంతగూటికి చేరుతున్నారు. ఆ సంస్థ సీఈవోగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. శామ్ తొలగింపును నిరసిస్తూ వైదొలగిన మాజీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మాన్ కూడా తిరిగి రానున్నారు.


శామ్ ను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా బోర్డు మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు సీఈవోలను మార్చింది. ఈ నేపథ్యంలో శామ్ పున:ప్రవేశానికి సూత్రప్రాయంగా ఓ ఒప్పందం కుదిరిందంటూ ఓపెన్ ఏఐ వెల్లడించింది. అలాగే కొత్త బోర్డుకు బ్రెట్ టేలర్ సారథ్యం వహిస్తారు. ఓపెన్ ఏఐను పునర్వ్యవస్థీకరించే బాధ్యత ముగ్గురు సభ్యులతో కూడిన కొత్త బోర్డు‌కు అప్పగించారు.

మొత్తం 9 మంది సభ్యులు ఉండేలా బోర్డును త్వరలో విస్తరిస్తారు. అందులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఓపెన్ ఏఐ‌లో అతి పెద్ద భాగస్వామి, పది బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. బోర్డు సభ్యునిగా కొనసాగాలని శామ్ ఆల్ట్‌మన్ కూడా కోరుకుంటున్నారు. అలాగే శామ్ ఉద్వాసనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. శామ్ తిరిగి రావడంపై ఓపెన్ ఏఐలో అతి పెద్ద పెట్టుబడిదారు త్రైవ్ కేపిటల్ స్వాగతించింది.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×