EPAPER

Canada | భారత నుంచి కెనడాకు ముప్పు.. కెనడా గూఢాచర సంస్థ నివేదిక!

Canada | కెనడాలో జరిగిన గత అధ్యక్ష ఎన్నికల్లో భారతదేశం పరోక్షంగా జోక్యం చేసుకుందని.. ఆ దేశ గూఢాచార సంస్థ నివేదిక సమర్పించింది. భారత్‌తో సహా, రష్యా, అమెరికా కూడా కెనడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయని ఈ నివేదికలో ఉంది. ఈ ఆరోపణలపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో కెనడా, భారత్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి నివేదిక రావడం ఆందోళనకరం.

Canada | భారత నుంచి కెనడాకు ముప్పు.. కెనడా గూఢాచర సంస్థ నివేదిక!

Canada | కెనడాలో జరిగిన గత అధ్యక్ష ఎన్నికల్లో భారతదేశం పరోక్షంగా జోక్యం చేసుకుందని.. ఆ దేశ గూఢాచార సంస్థ నివేదిక సమర్పించింది. భారత్‌తో సహా, రష్యా, అమెరికా కూడా కెనడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయని ఈ నివేదికలో ఉంది. ఈ ఆరోపణలపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో కెనడా, భారత్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి నివేదిక రావడం ఆందోళనకరం. ప్రపంచంలో చాలా దేశాలు తమ జాతీయ ఎన్నికల్లో ఇతర దేశాలు ప్రభావం చేస్తున్నాయని ఆరోపణలు చేస్తుంటాయి.


నిజానికి కెనడాలో ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా గాలివీస్తోంది. ఆయన పనితీరుపై పలువురు నిపుణలు, విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆయన చైనాకు సానుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో కెనడాకు తీవ్ర నష్టం జరుగుతుందని వారి వాదన. ఈ నేపథ్యంలో వారందరినీ కౌంటర్ చేసేందుకు జస్టిన్ ట్రూడో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 2019, 2021 సంవత్సరాల్లో కెనడాలో జరిగిన ఎన్నికల్లో భారత్, చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాలు జోక్యం చేసుకున్నట్లు వచ్చిన కెనడా రహస్య సమాచార విభాగం ఇచ్చిన నివేదికపై ఒక కమిటీ విచారణ చేయనుంది.

ప్రపంచంలో చాలా ధనిక దేశాలు.. పొరుగు దేశాలు, శత్రువు దేశాలలో జరిగే ఎన్నికల్లను ప్రభావితం చేస్తాయనేది బహిరంగ రహస్యం. ఈ అంశంపై డవ్ హెచ్ లెవిన్ అనే రచయిత మెడ్లెంగ్ ఇన్ ద బాలెట్ బాక్స్ (Meddling in the Ballot Box) అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం ప్రకారం.. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు ప్రపంచదేశాలలో 939 ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధికంగా 81 ఎన్నికల్లో అమెరికా ప్రభావం చూపగా.. 36 ఎన్నికల్లను రష్యా ప్రభావితం చేసింది. అంటే జరిగిన ప్రతి 9 దేశాల ఎన్నికల్లో ఒక దేశ ఎన్నికల్లో అమెరికా లేదా రష్యా ప్రభావం ఉంది.


ఏ ధనిక దేశమైనా.. నేరుగా మరొక దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోదు. అలా చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఆ ధనిక దేశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకనే శత్రు దేశం లేదా పొరుగు దేశం ఎన్నికల్లో ధనిక దేశాలు దాపరికంగా జోక్యం చేసుకుంటాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి లేదా పార్టీ ఎవరు తమకు అనుకూలంగా ఉంటే వారు విజయం సాధించడానికి ధన సహాయం లేదా ఆయుధాల సహాయం చేస్తాయి. అలా చేస్తే.. ఆ దేశ విదేశీ వ్యవహారాలు పాలసీ, అంతర్జాతీయ బిజినెస్ లాంటి అంశాలలో ధనిక దేశాలకు లాభం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా ఎన్నికల్లో పారదర్శకత ఉండాలనే ధ్యేయంగా కఠిన నిబంధనలు రూపొందిస్తోంది.

కెనడాలో గత సంవత్సరం.. ఖలిస్తానీ ఉగ్రవాది సిక్కుల నాయకుడు హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత కెనడా ప్రభుత్వం.. ఈ హత్య భారత ప్రభుత్వం చేయించిందనే ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×