EPAPER

Justin Trudeau Nijjar Killing: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు

Justin Trudeau Nijjar Killing: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు

Justin Trudeau Nijjar Killing| ఇండియా కెనెడా దేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు రాజుకుంది. కెనెడా పౌరసత్వం ఉన్న ఒక ఖలిస్తానీ మిలిటెంట్ హత్య వెనుక భారత దేశ ప్రభుత్వం ఉందని కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనాడా ప్రధాని ఆరోపణలపై ఇండియా ప్రభుత్వం స్పందిస్తూ.. కెనెడా ప్రభుత్వం నిరాధామైన ఆరోపణలు చేస్తోందని, వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని ప్రశ్నించింది. దాంతోపాటు భారత ప్రభుత్వం కెనెడాలోని తమ అంబాసిడర్లు, హై కమిషనర్లను వెనక్కు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక పబ్లిక్ ఎంక్వైరీని ఎదుర్కొన్నారు.


ఈ పబ్లిక్ ఎంక్వైరీలో ప్రధాని ట్రూడీ తమ వద్ద భారతదేశానికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేవని, కానీ ఖలిస్తానీ ఉద్యమ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత దేశం కుట్ర చేసినట్లు తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఆధారాలు లేకపోయినా కెనెడా వద్ద ఫైవ్ ఐస్ (Five eyes countries) ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని.. ఆ రిపోర్ట్ ప్రకారం.. ఇండియా ప్రభుత్వం నిజ్జర్ హత్య లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఫైవ్ అయిస్ దేశాలలో అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, యుక్ (బ్రిటన్), న్యూ జీల్యాండ్ ఉన్నాయి. ఈ అయిదు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ ని ఫైవ్ అయిస్ అంటారు.

అయితే పబ్లిక్ ఎంక్వైరీ సమయంలో ట్రూడో మాట్లాడుతూ.. కెనెడా లోని ఇండియా దౌత్య అధికారులు గూఢాచారులుగా వ్యవహరిస్తున్నారని మరోమారో ఆరోపణలు చేశారు. భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెనెడాలో ఎవరు మాట్లాడినా వారి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేవారి సమాచారాన్ని భారత అధికారులు.. లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ లాంటి క్రిమినల్స్ కు అందిస్తున్నారని.. ఆ తరువాత ఈ క్రిమినల్స్ వారి హత్య చేస్తున్నారని.. ముఖ్యంగా కెనెడాలో స్థిరపడ్డ ఖలిస్తాన్ గ్రూపు సభ్యలను టార్గెట్ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Also Read: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

భారత ప్రభుత్వం విచారణ ఏజెన్సీ అయిన నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ 2020లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనెడా దేశంలో పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. కానీ కెనెడా కేంద్రంగా ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపుని నడిపిస్తున్నాడని.. ఇండియాలో ఖలిస్తానీ ఉగ్రవాద చర్యలకు మాస్టర్ మైండ్ ఇతనేనని ఎన్ఐఏ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఈ క్రమంలో 2023 జూన్ నెలలో కెనెడాలోని బ్రిటీష్ కొలంబియాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో ఆరుగురు ఇండియా దౌత్య అధికారులు కుట్ర పన్నారని, వీరందరికీ బిష్నోయి గ్యాంగ్ తో సంబందాలున్నాయని కెనెడా పోలీసులు తెలిపారు.

ఈ విషయాలన్నీ తాను సెప్టెంబర్ 2023లో ఢిల్లీలో జరిగిన G20 దేశాల సమావేశాల సమయంలోనే చెప్పాల్సి ఉండగా.. తాను అది సరైన సందర్భం కాదని భావించి మౌనం వహించినట్లు కెనెడా ప్రధాని పబ్లిక్ ఎంక్వైరీ లో చెప్పారు. నిజ్జర్ హత్య కేసు విచారణలో లో భారత ప్రభుత్వం సహకరించడం లేదని కూడా అన్నారు.

మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కెనెడా ప్రధాని వ్యాఖ్యలను ఖండించింది. కెనెడా దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం అండదండలున్నాయని తెలిపింది. ఖలిస్తానీ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కెనెడా ప్రభుత్వం స్పందించలేదని భారత విదేశాంగ కార్యదర్శి రణధీర జైస్వాల్ అన్నారు. ఆధారాలు లేకుండా సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అని చెప్పడం ప్రధాని మంత్రి స్థాయి వ్యక్తికి తగదని ఆయన ఎద్దేవా చేశారు.

Related News

Yahya Sinwar Kamala Harris: ‘యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవాలి’.. ఇజ్రాయెల్‌కు కమలా హారిస్ సూచన

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

Oswal Daughter Uganda: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’

Lawrence Bishnoi: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

Big Stories

×