Handsome Man: ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే చెప్పడం చాలా కష్టం. కానీ శాస్త్రీయంగా అందమైన వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీని ఉపయోగించి అందమైన వ్యక్తిని కనిపెట్టవచ్చు. దీనిద్వారా ఒక వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించవచ్చు.
ఇటీవల ఈ టెక్నాలజీ సహాయంతో ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తిని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా బ్రిటీష్ నటుడు రెగె జీన్ పేజ్ ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రక్రియ ద్వారా జీన్ కళ్లు, పెదాలు, దవడ, ముక్కు, ముఖం అమరికలను అంచనా వేయగా.. 93.65 శాతం కచ్చితత్వంలో ఉన్నట్లు తెలిపారు.
ఇక అందమైన వ్యక్తుల్లో రెండో స్థానంలో 93.53 శాతం కచ్చితత్వంతో థోర్ సినిమాలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఉండగా.. మూడో స్థానంలో 93.46 శాతం కచ్చితత్వంతో బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయేల్ బి జోర్డాన్ ఉన్నారు.