EPAPER

U.S: అమెరికాలోనూ రుణమాఫీ? నిజమేనా?

U.S: అమెరికాలోనూ రుణమాఫీ? నిజమేనా?

Biden government announced another round of student loan forgiveness
తెలంగాణలో రుణమాఫీ ఇప్పుడు హాట్ టాపిక్ అంశం. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెల్లిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే రెండు విడతల్లో రుణమాఫీ పథకం చేపట్టారు. దీనిపై రాష్ట్ర రైతాంగం సర్వత్రా సీఎం రేవంత్ రెడ్డిపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం ఫొటోలకు పాలాభిషేకాలు సైతం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కాదు రుణమాఫీ అని ఛాలెంజ్ చేసిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. గత పదేళ్లుగా తాము చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఏడు నెలల కాలంలో ఎలా పూర్తిచేశాడని అనుకుంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అమెరికాలోనూ రుణమాఫీ పథకం అమలుకు సిద్ధమవుతున్నారు అధికార పార్టీ నేత. అయితే రైతులకు కాదు విద్యార్థులకు. గతంలోనే విద్యార్థులకు రుణ మాఫీ అమలు చేస్తున్నా దానిని మరింత కాలం పొడిగించారు.దీనితో 35 వేల అమెరికన్ విద్యార్థులు లబ్ది పొందనున్నారు.


వెయ్యి కోట్ల రుణ మాఫీ

తమ ప్రభుత్వం ఇప్పటిదాకా విద్యార్థుల రుణ మాఫీపై వెయ్యి కోట్లు ఖర్చుచేశామని బైడెన్ చెబుతున్నారు. ఎక్కవగా లబ్దిదారులలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించినవారే ఉన్నారని బైడెన్ తెలిపారు. వారిలో డాక్టర్, నర్సింగ్, లాయర్, పోలీస్ తదితర కోర్సులు చదివేవారు ఉండటం విశేషం. రుణమాఫీపై అమెరికన్ కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ బైడెన్ తాను విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు. గతేడాది కూడా రుణమాఫి ప్రకటించిన దానిక కన్నా ఎక్కువగానే విద్యార్థులకు లబ్ది చేకూరేలా మరింత మందికి అవకాశం కల్పించామని అన్నారు. లక్షా యాభై వేలకు గాను లక్షా అరవై వేల విద్యార్థులకు గతేడాది అవకాశం కల్పించామని బైడెన్ చెబుతున్నారు.


ఎన్నికల స్టంట్ అంటున్న విపక్షాలు

అయితే కేవలం ఈ సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అమెరికాలో యువ ఓటర్ల సంఖ్య ఎక్కవ కావడంతో యువతను ఆకర్షించేందుకే బైడెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఒక పక్క అమెరికా ఉన్నత న్యాయస్థానంలో రుణ మాఫీ అంశంపై కేసు నడుస్తుండగా బైడెన్ ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని తీవ్ర స్థాయిలో బైడెన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. బైడెన్ మాత్రం తాను విద్యార్థుల శ్రేయస్సుకే కట్టుబడి ఉన్నానని..వాళ్లకు ఎటువంటి అన్యాయం జరిగినా సహించనని అంటున్నారు. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా విద్యార్థులకు రుణమాఫీ పథకం వర్తించడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్నారు.

విద్యార్థి లోకం హర్షం

ఎన్నికలలో తాము గెలుస్తామా? లేదా అని ఆలోచించడం లేదని అన్నారు. కొన్ని సార్లు స్వప్రయోజనాలను పక్కన పెట్టి పేద విద్యార్థులకు లబ్ధి కలిగిందా లేదా అని తాను ఆలోచిస్తానని..ఇందులో ఎటువంటి రాజకీయాలకూ తావులేదని..ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అని వాళ్ల విమర్శలు తిప్పికొట్టారు. రాజకీయాలు ఎలా ఉన్నా తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రుణమాఫీ చేయడంపై విద్యార్థి లోకం బైడెన్ ప్రభుత్వాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×