EPAPER

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ పబ్లిక్ కు బెంజమిన్ నెతన్యాహు సారీ చెప్పారు.. అందుకేనా?

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ పబ్లిక్ కు బెంజమిన్ నెతన్యాహు సారీ చెప్పారు.. అందుకేనా?

Benjamin Netanyahu Says He Is Sorry About Hamas October 2023 Attacks: ఇజ్రాయెల్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా ఇరాన్ దాడులు జరపవచ్చనే అమెరికా హెచ్చరికలతో అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్ కు సహాయ హస్తం అందించేందుకు అమెరికా ఆయుధాలు, యుద్ధ ట్యాంకర్లతో సిద్ధంగా ఉంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అక్కడి పాపులర్ న్యూస్ మేగజైన్ టైమ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఒకానొక విషయంలో తాను తనని నమ్ముకున్న ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయానని.. ఇప్పటికీ ఆ విషయం తనని బాధిస్తూనే ఉందని అన్నారు. అంతలా బాధపెట్టిన సంఘటన ఏమయివుంటుందని అడగగా 2023 సంవత్సరం చివరలో ఇజ్రాయెల్ బోర్డర్ లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడ్డారు. సరిహద్దు గ్రామాలలోని ప్రజలను చిత్ర హింసలకు గురచేశారని.. ఆస్తులు విధ్వంసం చేశారని, హత్యలు, దోపిడీల వంటి చర్యలతో భీభత్సాన్ని సృష్టించారని అన్నారు.


ఉగ్రవాదులను ఉపేక్షించం

ఎందరో అమాయకులైన ఇజ్రాయెల్ పౌరులను హమాలీ టెర్రరిస్టులు బందీలుగా చేసి వారిని కిడ్నాప్ చేశారని అన్నారు. ఇంత జరుగుతున్నా తాను ఎందుకు మౌనం వహించానో అర్థం కావడం లేదని అన్నారు. ఆ సంఘటన తనని ఎప్పటికీ బాధిస్తునే ఉంటుందని అన్నారు. అందుకనే ఇజ్రాయెల్ పౌరులంతా తనని క్షమించాలని కోరుతున్నారు. ఇకపై అలాంటి ఉగ్రవాదులను ఉపేక్షించే పనే లేదని అన్నారు. అమెరికా దేశం ఇజ్రాయెల్ కు అండగా నిలిచిందని అన్నారు. అమెరికా అందిస్తున్న సహాయసహకారాలకు ఎప్పటికీ తమ దేశం రుణపడి ఉంటుందని టైమ్ మేగజైన్ ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యూహు తెలిపారు.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×