EPAPER

PM Modi: హిందువుల భద్రతపై బంగ్లాదేశ్ సలహాదారు ప్రధాని మోదీకి ఫోన్‌కాల్‌

PM Modi: హిందువుల భద్రతపై బంగ్లాదేశ్ సలహాదారు ప్రధాని మోదీకి ఫోన్‌కాల్‌

Bangladesh Advisor On Hindu Security Phone Call To Prime Minister Modi: గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌లో మారణహోమం జరుగుతోంది.బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీలకు రక్షణ కరువైంది. అయితే ఇదే అంశంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌ఖాన్ భారత ప్రధాని మోదితో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పిస్తామని మోదీకి హామీ ఇచ్చారు ముఖ్య సలహాదారు యూనస్‌ఖాన్. ప్రొఫెసర్ యూనస్‌ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మోదీ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ప్రజాస్వామ్య, శాంతియుతంగా ఉండాలని బంగ్లాదేశ్‌కి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.


ఆగష్టు 15 సందర్భంగా చేసిన మోదీ ప్రసంగిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందూ, మైనార్టీల పరిస్థితి గురించి మోదీ ప్రస్థావన తీసుకొచ్చారు. అనంతరం హింస నెలకొన్న బంగ్లాదేశ్‌లో జనజీవన పరిస్థితి త్వరలోనే సాధారణ పరిస్థితికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొరుగుదేశంలో ఉన్న హిందువులంతా దాడులకు గురవడంపై భారత్‌లోని 141 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని మోదీ తెలిపారు.

Also Read: బంగ్లాదేశ్‌ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?


ఈ నేపథ్యంలో యూనస్‌ఖాన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ప్రస్తుతం అక్కడి పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు యూనస్‌ఖాన్, భారత ప్రధానికి ఫోన్‌లో వివరించారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×