EPAPER

Australia PM Anthony Albanese: పదవిలో ఉండగా పెళ్లి.. ఆస్ట్రేలియా ప్రధాని కొత్త చరిత్ర..

Australia PM Anthony Albanese: పదవిలో ఉండగా పెళ్లి.. ఆస్ట్రేలియా ప్రధాని కొత్త చరిత్ర..

Australia PM Second Marriage : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. జోడీ హైడన్‌ అనే మహిళతో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ విషయాన్ని ఆసీస్ పీఎం స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టారు. జోడి హైడన్ తో కలిసి దిగిన సెల్ఫీని అంథోని అల్బనీస్ పోస్ట్ చేశారు. ఆమె అంగీకారం తెలిపిందని ఆ పోస్టులో పేర్కొన్నారు. మళ్లీ వివాహం చేసుకోబోతున్న అల్బనీస్ కు ఆస్ట్రేలియాలోని అధికార, ప్రతిపక్ష లీడర్ విషెస్ చెప్పారు. పదవిలో ఉన్న సమయంలో ఓ ఆస్ట్రేలియా ప్రధాని వివాహం చేసుకోవడం ఆ దేశ చరిత్ర ఇదే తొలిసారి కావడం విశేషం..


ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ వయస్సు 60 ఏళ్లు. న్యూ సౌత్‌ వేల్స్‌ డిప్యూటీ ప్రీమియర్‌ కార్మెల్‌ టెబట్‌ను తొలుత వివాహం చేసుకున్నారు. 2000లో వారి పెళ్లి జరిగింది. ఈ జంటకు 23 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే 19 ఏళ్ల వివాహ బంధానికి 2019లో ముగింపు పలికారు. అంథోని అల్బనీస్, కార్మెల్ టెబట్ జంట విడాకులు తీసుకున్నారు.

Read More: మిడతల దండయాత్ర.. కారణమిదే!


2020లో మెల్‌బోర్న్‌లో జరిగిన బిజినెస్‌ డిన్నర్‌లో హైడన్‌తో ఆంథోని అల్బనీస్ కు పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా అల్బనీస్, హైడెన్ ప్రేమలో ఉన్నారు.ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. 2022లో జరిగిన ఫెడరల్‌ ఎన్నికల సమయంలోనూ అల్బనీస్ తో కలిసి హైడెన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ప్రధానిగా ఆంథోని అల్బనీస్ విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన అధికారిక పర్యటనలకు హైడెన్ ను వెంట తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూ సౌత్‌ వేల్స్‌ పబ్లిక్‌ సర్వీస్‌ అసోసియేషన్‌లో అధికారిణిగా పనిచేస్తున్నారు.

Tags

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×