EPAPER

Attack on Indians in US: అమెరికాలో ఆగని దాడులు.. మరో భారతీయుడి మృతి

Attack on Indians in US: అమెరికాలో ఆగని దాడులు.. మరో భారతీయుడి మృతి
Telugu flash news

Executive Vivek Taneja Dies Days After Being Assaulted In US(Telugu flash news): అగ్రరాజ్యంలో భారతీయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నెలరోజుల వ్యవధిలో వివిధ కారణాలతో ఆరుగురు చనిపోగా.. తాజాగా మరొకరు బలయ్యారు. భారత సంతతికి చెందిన 41 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా.. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించారు. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్ వెలుపల ఈ నెల 2న తనేజాపై దాడి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వరుస దాడుల్లో భారతీయులు టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది.


Read More: Pakistan Results : పాకిస్థాన్ లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. దేశాన్ని ఏలేదెవరు ?

గతవారం హైదరాబాద్‌ యువకుడు సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. షికాగోలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అలాగే, తెలంగాణకు చెందిన శ్రేయాస్‌రెడ్డి బెనిగెర్‌(19)తో పాటు నీల్ ఆచార్య, వివేక్ సైనీ‌(25), అకుల్ ధావన్‌, సమీర్ కమాథ్‌ వేర్వేరు కారణాలతో మృతి చెందారు.


అమెరికాలో ఉన్నత చదువుల కోసం కోటి కలలు, ఆశలతో ఏటా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు వెళ్తున్నారు. ఇటీవలి కాలంలో వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులకే ఎక్కువ ముప్పు ఉన్నట్టు 2017 నాటి అధ్యయనం చెబుతోంది.

భారత అమెరికన్ల పట్ల వివక్ష స్కూల్ స్థాయి నుంచే ఆరంభమవుతున్నట్టు తేలింది. 2022లో హిందువులు, భారతీయులపై 25 విద్వేష నేరాలు జరిగినట్టు ఆ అధ్యయనం తెలిపింది. 2021లో వీటి సంఖ్య 12 మాత్రమే.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×