EPAPER
Kirrak Couples Episode 1

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

No Durga Puja, idol immersions in Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఉన్న హిందూ మైనార్టీలపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూవులు అధిక సంఖ్యలో నిర్వహించుకునే దుర్గాపూజపై ఆంక్షలు విధిస్తున్నారు. కొంతమంది బెదిరింపులకు పాల్పడుతుండగా.. మరికొంతమంది ఏకంగా దుర్గా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా, ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల అరాచకాలు సృష్టిస్తున్నారు.


బంగ్లాదేశ్‌లో హిందూవుల అతిపెద్ద పండుగ ‘దుర్గాపూజ’. ఈ పండుగను నిర్వహించకూడదని రాడికల్ ఇస్లామిక్ గ్రూపు సభ్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ కూడా దుర్గా పూజల్లో పాల్గొనకూడదని, విగ్రహారాధన, నిమజ్జనం వంటి చేయకూడదని బెదిరింపులకు గురి చేశారని అక్కడ హిందూ సంఘాల సభ్యులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా, హిందూవులు దుర్గాపూజ వేడుకల కోసం సిద్ధమవుతుండగా.. ప్లేగ్రౌండ్‌ను ఉపయోగించడాన్ని ఇన్సాఫ్ కీమ్ కారీ ఛత్ర, జంట్రా రాడికల్ ఇష్లామిక్ గ్రూప్ వ్యతిరేకించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సెక్టార్ 13లో నిరసన ప్రదర్శనలు చేసింది. అయితే, ఈ ప్రాంతంలో హిందూవులు అత్యధిక సంఖ్యలో ఉండడంతోపాటు చాలా సంవత్సరాలుగా హిందూవులు దుర్గాపూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దుర్గా పూజ నిర్వహణపై ఆంక్షలు విధించడంతో హిందూవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఢాకాలో రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ సంస్థలు రోడ్లన్నీ బ్లాక్ చేసేశాయి. పబ్లిక్‌గా దుర్గామాత విగ్రహాలు ఎక్కడా కూడా పెట్టకూడదని, పూజలు సైతం నిర్వహించడానికి వీలులేదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే విగ్రహాల నిమజ్జనం చేయొద్దని తేల్చి చెప్పారు. విగ్రహాల నిమజ్జనంతో నీటి కాలుష్యం పెరుగుతుందని, ఇలా చేసేందుకు వ్యతిరేకిస్తున్నట్లు కొంతమంది ఇస్లామిక్ గ్రూపు సభ్యులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

అలాగే, బంగ్లాదేశ్ జనాభాలో హిందూవులు 2 శాతానికిపైగా ఉన్నారు. ఆ దేశ జనాభాతో పోల్చితే తక్కువ శాతం హిందూవులు ఉన్నప్పటికీ దుర్గాపూజను జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. ఇలా జాతీయ సెలవుదినంగా ప్రకటించడం మొదటి నుంచి ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ వ్యతిరేకిస్తుంది. దీంతో ఆ గ్రూప్ పెద్ద సమస్యగా భావిస్తూ వస్తుంది. అందుకే దుర్గా పూజలను నిర్వహించేందుకు మెజార్టీ ముస్లింలు ఒప్పుకోవడం లేదు. ఇందులో భాగంగానే దుర్గాపూజపై ఆంక్షలు విధించడంతో పాటు విగ్రహాల నిర్వహణకు మద్దతు తెలపకూడదని హెచ్చరించింది.

Also Read: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందూవులు ఎక్కువ సంఖ్యలో భూములు ఆక్రమించారని ఆరోపణలు చేస్తున్నారు. భూములను ఆక్రమించి దేవాలయాలు నిర్మించారని కొంతమంది ముస్లింలు విమర్శలు చేస్తున్నారు. హిందూ దేవాయలను సైతం తొలగించాలనే కొంతమంది సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం రాడికల్ ఇస్లామిక్ సభ్యులు 16 అంశాలను డిమాండ్ల జాబితాను ప్రదర్శించింది.

అలాగే హిందూవులు తప్పనిసరిగా ప్రతి ఆలయాల్లో భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు, నినాదాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. హిందూ పౌరులు బంగ్లాదేశ్‌పై తమ విధేయతతోపాటు భారత వ్యతిరేకతను నిరూపించుకునేందుకు అన్ని దేవాలయాల్లో వ్యతిరేక బ్యానర్లు పెట్టాలని మరో డిమాండ్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉండగా, దుర్గాపూజ చేసేందుకు రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రూ.5 లక్షలు డిమాండ్ చేశారని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే హిందూ సంఘాలు తాత్కాలిక ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మహ్మద్ యూనస్ హామీ ఇచ్చినప్పటికీ, బంగ్లాదేశ్‌లో హిందూవులపై దాడి జరుగుతుందని అక్కడ ఉన్న హిందూ సంఘాలు ఆందోళన చెస్తున్నారు.

Related News

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Russia nuclear Weapons: ‘ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!

Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?

PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Big Stories

×