USA Presidential Elections : అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అక్కడి సర్కారు వినూత్నమైన చర్యలు చేపట్టింది.
ఇంటి నుంచే ఓటింగ్…
ఇక పోలింగ్ కేంద్రాల్లోనే కాకుండా ఇంటి నుంచి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ ఓటింగ్ వ్యాన్ను సైతం సిద్ధం చేశారు. ఇక మొదటిసారిగా పెన్సిల్వేనియాలోని మోంట్గోమేరీ కౌంటీలో మొబైల్ ఓటింగ్ వ్యాన్ను అందుబాటులోకి తేవడం గమనార్హం.