EPAPER

Israel – Iran War: ఇరాన్‌ను రెచ్చగొడుతున్న అమెరికా.. ఆపలేని యుద్ధం మొదలైందా?

Israel – Iran War: ఇరాన్‌ను రెచ్చగొడుతున్న అమెరికా.. ఆపలేని యుద్ధం మొదలైందా?

యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్రికన్ కమాండ్.. ఇండో పసిఫిక్ కమాండ్.. సెంట్రల్ కమాండ్.. వీటన్నింటిని కో ఆర్డినేట్ చేస్తూ పెంటగాన్.. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఏరియాలో చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో పాటు.. అన్ని వ్యవస్థలను అలెర్ట్ చేసింది అమెరికా.. అంతేకాదు ఇజ్రాయెల్‌పై ఏదైనా దాడి జరిగితే అడ్డుకోవడానికి కావాల్సిన సాయాన్ని పంపుతుంది. USS అబ్రహం లింకన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్.. USS రూజ్‌వెల్ట్‌ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్.. ఈ రెండు గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో పోజిషన్‌ తీసుకున్నాయి.

క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ అంటే తెలుసు కదా.. ఇందులో ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియత్‌తో పాటు డిస్ట్రాయర్స్‌.. ఫ్రిగేట్స్.. సబ్‌ మెరైన్స్ ఇలా అన్ని ఉంటాయి. ఇలాంటి రెండు గ్రూప్‌లను మోహరించింది అమెరికా. దీనికి తోడు ఫైటర్ జెట్ స్క్వాడ్రన్.. ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి.. ? ఎక్కడ మోహరిస్తున్నారు? అనేది చాలా సీక్రెట్‌గా ఉంచారు. అంతేకాదు బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్‌ కేపబుల్ డిస్ట్రాయర్లను కూడా అదనంగా మోహరిస్తున్నారు. యూరోపియన్, మిడిలి ఈస్ట్ రిజియన్స్‌లో ల్యాండ్ బేస్‌డ్‌ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్‌ వెపన్స్‌ను రెడీ చేశారు. మొత్తంగా ఫుల్‌ స్కేల్ వార్ జరిగితే ఎదుర్కోవడానికైనా.. ఎదురుదాడి చేయడానికైనా.. దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నాయి అమెరికా మోహరింపులు.


నిజానికి గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి తర్వాత ఈ రీజియన్‌లో పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి పరిస్థితి నివురు గప్పిన నిప్పులానే ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారడానికి కారణం..హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్ హనియా.. హమాస్‌ మిలటరీ కమాండర్ మహమ్మద్ డెయిఫ్‌..హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫాద్ షుక్ర్‌.. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో ప్లేస్‌లో మట్టుపెట్టింది ఇజ్రాయెల్.. ఇందులో హనియాను ఇరాన్‌లో మట్టుపెట్టడం ఎక్కువ వివాదస్పదమైంది. దీంతో ఇరాన్‌ ప్రతికార చర్యలకు రెడీ అవుతుంది.

ఇజ్రాయెల్‌పై దాడికి మిత్రదేశాలన్ని కలిసి రావాలని ఇరాన్‌ పిలుపునిచ్చింది. లెబనాన్‌ కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై కత్తులు నూరుతుంది. అదే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలకు మరింత కారణం.. నిజానికి ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిసైల్స్‌, డ్రోన్లతో సక్సెస్‌ఫుల్‌గా దాడులు చేసింది. అత్యంత ఆధునికమైన, నమ్మకమైన ఐరన్ డ్రోమ్‌ వ్యవస్థను మట్టి కరిపించింది ఇరాన్.. జీయోగ్రఫికల్‌గా చూస్తే ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య చాలా దూరం ఉంది. కానీ అయినా దాడులు చేసింది ఇరాన్.. ఇప్పుడు అదంతా శాంపిల్ మాత్రమే అని.. అసలు సినిమా అంతా ముందే ఉందని వార్నింగ్స్‌ ఇస్తుంది. దీంతో ఇజ్రాయెల్‌ ఏ చాన్స్‌ తీసుకోవాలనుకోవడం లేదు.. ఇరాన్‌ వార్నింగ్స్‌ ఇవ్వగానే అమెరికాను కాంటాక్ట్ చేసింది. ఇజ్రాయెల్‌కు రక్షణ కవచంలా తాము ఉంటామని అమెరికా హామీ ఇచ్చింది. ఇచ్చినట్టుగానే చర్యలు తీసుకుంది.

Also Read: ఎట్టకేలకు ట్రంప్ అంగీకారం.. హ్యారిస్‌తో డిబేట్‌కు సై

నిజానికి చాలా రోజులుగా ఇజ్రాయెల్‌కు రక్షణగా ఆ ప్రాంతంలో అమెరికా రక్షణ చర్యలు తీసుకుంది ఇజ్రాయెల్ కోసం.. ఒక్క యూఎస్ కాదు.. ఫ్రాన్స్, బ్రిటన్‌ కూడా మిసైల్స్, డ్రోన్స్‌ను పంపింది ఇజ్రాయెల్ కోసం.. అయితే ఇజ్రాయెల్‌ కోసం దేశాలన్ని ఏకమవుతున్నాయి. అయితే అటు రెడ్‌ సీలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే హౌతీ నేత అబ్దుల్ మాలిక్ కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఇజ్రాయెల్‌ ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా సహించేది లేదంటున్నాడు. కాబట్టి.. ఒక బుల్లెట్‌ పేలడమే ఆలస్యం.. విధ్వంసం జరగడానికి కావాల్సిన సరంజామా రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇరాన్ దాడి చేస్తే.. అమెరికా కౌంటర్ చేస్తుంది. అమెరికా కౌంటర్‌ అటాక్ చేస్తే.. దాడులు చేసేందుకు లెబనాన్‌లో హెజ్బుల్లా రెడీగా ఉంది.. హెజ్బుల్లా వద్ద దాదాపు లక్ష వరకు రాకెట్లు ఉన్నాయని తెలుస్తుంది. వాటిలో పావు వంతు వాడినా.. అందులో కొన్ని తమ లక్ష్యాలను చేరుకున్నా.. జరిగే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇచ్చే సమాధానం కూడా భారీగానే ఉంటుంది. అదే సమయంలో హౌతీలు రెడ్‌ సీలోని ఇజ్రాయెల్, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలు, ఇంధన ట్యాంకర్లపై పడతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలయమ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ఒక చిన్న ఘటన ప్రపంచ గతిని మార్చేందుకు రెడీగా ఉంది.

నిజానికి యుద్ధాన్ని ఎవ్వరూ కోరుకోవడం లేదు. అటు ఇరాన్‌, ఇటు ఇజ్రాయెల్.. ఇది ఆ రెండు దేశాలకు మంచిది కాదు.. వారి తలకు మించిన భారం కూడా.. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు.. ఏదో ఒకటి చేసి తీరాలని చూస్తోంది ఇరాన్.. దీన్ని అవకాశంగా మలుచుకొని హమాస్,హెజ్బుల్లాను అంతం చేయాలని చూస్తోంది ఇజ్రాయెల్.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×