EPAPER

US fears about October Surprise : అమెరికాకు ‘అక్టోబర్ సర్‌ప్రైజ్’.. ఇచ్చేదెవరు..? ఇబ్బందులెవరికి..?

US fears about October Surprise : అమెరికాకు ‘అక్టోబర్ సర్‌ప్రైజ్’.. ఇచ్చేదెవరు..? ఇబ్బందులెవరికి..?

US fears about October Surprise : ఒక చిన్న దేశం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాన్ని భయపెట్టగలదా..? కానీ, ఇక్కడ అదే జరుగుతోంది. మనమంతా ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికాను.. ఉత్తర కొరియా వణికిస్తోందట. రష్యా అండతో కిమ్ జోంగ్ జోరు పెరిగిందని యూఎస్ అధికారులు కంగారుపడుతున్నారు. రాబోయే ఎన్నికలకు ‘అక్టోబర్ సర్‌ప్రైజ్’ ఇదేనని వైట్ హౌస్‌ అప్రమత్తమవుతోంది.. ఇంతకీ, ఏంటీ ‘అక్టోబర్ సర్‌ప్రైజ్’? ఉత్తర కొరియా వ్యూహం ఏంటీ..? దీన్ని అమెరికా ఎలా ఎదుర్కోబోతోంది..?


ఇప్పుడు అంతర్జాతీయంగా నడుస్తున్న చర్చ ఇదే.. అమెరికాకు ‘అక్టోబర్ సర్‌ప్రైజ్’ సిద్ధమయ్యిందట. ప్రపంచ పెద్దన్న అమెరికాకు గిఫ్టులివ్వడం ఓకే గానీ ఈ సర్‌ప్రైజ్ ఏంటీ అనే డౌట్ రావచ్చు. కానీ, రష్యా, ఉత్తర కొరియాల నుండి ఈ సర్‌ప్రైజ్ అందుతుందని వైట్ హౌస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ప్రపంచ పరిస్థితులన్నీ ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో అమెరికా ఎన్నికలకు వెళుతోంది. ఒక వైపు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. ఈ మధ్యలో ఇరాన్‌తో తప్పిన పెను ప్రమాదం.. వీటన్నింటిలో పెద్దన్నదే పెత్తనం అంతా.. అందుకే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌కు చెమటలు పడుతున్నాయి. రష్యా, ఉత్తర కొరియా బంధం పెరుగుతున్న కొద్దీ అమెరికా ఎన్నికల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు వైట్ హౌస్ అధికారులు కలవరపడుతున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య నానాటికీ పెరిగిపోతున్న సైనిక కూటమి ప్రభావమే ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది. ప్యోంగ్యాంగ్ అణు సామర్థ్యాలను విస్తృతంగా విస్తరించే అవకాశం ఉందని.. ఈ పరిణామం, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతుందని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి, వైట్ హౌస్ సీనియర్ అధికారులే స్వయంగా మీడియాకు చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలో.. ఉత్తర కొరియా తీవ్రమైన రెచ్చగొట్టే సైనిక చర్యలను చేపట్టే అవకాశం ఉందని.. ఈ దశాబ్ధంలో ఎప్పుడూ లేనంతగా ఇవి ఉంటాయని అనుమానిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నారు. ఇక, ఈ పరిణామం దాదాపు సాధ్యంగా కనిపిస్తుండటంతో.. దీనికి సిద్ధంగా ఉండటానికి అమెరికా అధికారులు కూడా అవసరమైన చర్యలను చేపడుతున్నారని తెలుస్తోంది.


Also Read : ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. రాబోతున్న మరో సంక్షోభం ?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికల పోటీలో ఉన్నారు. అయితే, వీరిని వైట్ హౌస్‌కు తిరిగి పంపాలా వద్దా అని అమెరికన్లు ఇంకా ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇరువురు అధ్యక్షులు తమ కాలంలో అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపించారు. ఇక.. ఇప్పుడు వీళ్లలో ఎవరు వచ్చినా ప్రపంచంలోని మరొక భూభాగంలో గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారట. ఈ సందేహాల మధ్య.. ఈ ఏడాదిలో.. అంటే, అమెరికా ఎన్నికలక వెళుతున్న సమయంలో.. ఉత్తర కొరియా రెచ్చగొట్టేలా ఉందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదని కూడా అంటున్నారు. అయితే.. ఉత్తర కొరియా చేపట్టే చర్యలు ఎంత వరకు ఉద్ధృతంగా ఉంటాయనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంటున్నారు.

ఇక.. రాబోయే వారాల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌తో కలవడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో, ప్యోంగ్యాంగ్‌కు సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ఒక కొత్త ఒప్పందాన్ని ఇరు దేశాలూ పటిష్టం చేస్తారని యుఎస్ అధికారులు భావిస్తున్నారు. ఇది అమెరికా ఆధిపత్యానికి ఆటంకం కలిగిస్తుందనే టాక్ ఉంది. ఎందుకంటే.. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యాకు ప్యోంగ్యాంగ్ పెద్ద మొత్తంలో ఆయుధాలను పంపినందుకు బదులుగా పుతిన్ ఉత్తర కొరియాకు అణు జలాంతర్గామి, బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను అందిస్తున్నట్లు యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు విశ్వసిస్తున్నారు. మిలియన్ల కొద్దీ ఫిరంగి షెల్స్‌తో సహా ఉక్రెయిన్‌కు యూరప్ అందించే దానికంటే ఎక్కువ ఆయుధాలను ఉత్తర కొరియా రష్యాకు అందిస్తుంది. ఇక అణ్వాయుధ క్షిపణిని ప్రయోగించగల మొదటి జలాంతర్గామిని రంగంలోకి దింపడానికి అవసరమైన తుది దశలను పూర్తి చేసేందుకు రష్యా ఉత్తర కొరియాకు సహాయం చేస్తుందని కూడా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి, ఉత్తర కొరియా నుంచి అణు పరీక్ష జరగాలని బైడెన్ ప్రభుత్వం కొంతకాలంగా ఎదురుచూస్తోంది. కిమ్ దక్షిణ కొరియాతో సైనికరహిత ప్రాంతంలో దూకుడుగా చర్యలు తీసుకున్నా.. లేదంటే, 2010 నుండి ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా.. దక్షిణ కొరియా సరిహద్దు ద్వీపాలను షెల్స్ చేస్తే ఎలా స్పందించాలనే దానిపై యూఎస్ ఇటీవల ఆకస్మిక ప్రణాళికలను సిద్ధం చేసింది. అలాగే, దక్షిణ కొరియా, జపాన్‌లతో అమెరికా సమన్వయాన్ని గమనిస్తూ, “మేము సిద్ధంగా ఉండబోతున్నాం” అని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఉత్తర కొరియా తన దేశీయ ఆయుధాల తయారీలో రష్యా సహాయం చేయగలదని భావిస్తోంది. ఇక, ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న బంధం.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్‌ భాగస్వామ్యాన్ని కూడా సృష్టించగలదని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×