EPAPER

Aditya L1 | ఇండియా మరో అంతరిక్ష ఘనత.. సూర్యుడికి అతిసమీపంలో ఆదిత్య ఎల్1 !

Aditya L1 | చంద్రయాన్ సక్సెస్ తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో(ISRO) మరో ఘనత సాధించింది. నింగిలో ఇస్రో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఆదిత్య ఎల్ 1 శనివారం మధ్యాహ్నం 4 గంటలకు సూర్యుడి ఫైనల్ ఆర్బిట్(చివరి కక్ష్య) అంటే సూర్యుడికి అతిసమీపంగా చేరుకుంది

Aditya L1 | ఇండియా మరో అంతరిక్ష ఘనత.. సూర్యుడికి అతిసమీపంలో ఆదిత్య ఎల్1 !

Aditya L1 | చంద్రయాన్ సక్సెస్ తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో(ISRO) మరో ఘనత సాధించింది. నింగిలో ఇస్రో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఆదిత్య ఎల్ 1 శనివారం మధ్యాహ్నం 4 గంటలకు సూర్యుడి ఫైనల్ ఆర్బిట్(చివరి కక్ష్య) అంటే సూర్యుడికి అతిసమీపంగా చేరుకుంది. ఇదే ఆదిత్య ఎల్ 1 (Lagrangean Point 1)గమ్య స్థానం.


ఇస్రో సాధించిన ఈ ఘనతతో ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్య పోతున్నాయి. 1500 కేజీల బరువైన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.. రూ.400 కోట్ల ఖర్చుతో తయారైంది. ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్‌ని ఇస్రో సెప్టెంబర్ 2న.. సూర్యుడిని దెగ్గర నుంచి అధ్యయనం చేసేందుకు శ్రీహరి కోట స్టేషన్ నుంచి నింగిలోకి లాంచ్ చేసింది.

ఇప్పుడు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడి దెగ్గరగా ఉన్న హాలో ఆర్బిట్‌లోకి చేరుకుంది. హాలో ఆర్బిట్‌లో భూమి, సూర్యుడు ఇరువురి గురుత్వాకర్షణ శక్తి(Gravitational Force) సమానంగా ఉంటుంది. అందుకే ఈ ఆర్బిట్‌లో ఏదైనా వస్తువు సూర్యుడి నుంచి సురక్షితంగా ఉంటుంది. సూర్యుడుగానీ, భూమిగానీ తమవైపు ఆ వస్తువుని గురుత్వాకర్షణ శక్తితో లాగలేవు. ఈ హాలో ఆర్బిట్‌లో ఆదిత్య ఎల్ 1 రెండేళ్లపాటు ఉండి సూర్యుడిని ఎటువంటి గ్రహణాల అడ్డంకులు లేకుండా స్పష్టంగా చూసి.. అధ్యయనం చేయగలుగుతుంది.


ఇస్రో సాధించిన ఈ ఘనతను ప్రశంసిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ ట్వట్టర్‌లో పోస్టు చేశారు.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×