EPAPER

Sea Turtle Meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత!

Sea Turtle Meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత!

sea


9 people Died 78 Others Hospitalized After Eating Turtle Meat: కొన్ని ఆహారాలు తినడానికి ఎంత రుచిగా ఉంటాయో, అవి ఆరోగ్యానికి కూడా అంతే హాని కలిగిస్తాయి. కాబట్టి ఏదైనా తినేముందు అవి ఆరోగ్యానికి మంచిదా కాదా అని తెలుసుకోవాలి. కాదు కూడదూ తినాల్సిందే వాటి రుచి టేస్ట్ చేయాల్సిందే అనుకున్నారా.. అంతే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకి ప్రమాదాలు కూడా జరగవచ్చు. తాజాగా ఇలాంటి విషాదకరమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. తాబేళ్లను చాలామంది ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో తాబేళ్లను పెంచితే సిరి సంపదలు వస్తాయని కొంతమంది నమ్ముతుంటారు.

అయతే కొంత మంది మాత్రం వీటిని ఆహారంగా తీసుకుంటారు.  ఇటీవల కొంత మంది తాబేళ్లు మాంసం తిని తొమ్మిది మంది మరణించారు. మరో 78 మంది అస్వస్థకు గురయ్యారు. ఈ విషాదకరమైన ఘటన ఆఫ్రికాదేశమైన టాంజీనియాకు సమీపంలో జాంజిబార్ దీవుల్లో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే .. జాంజిబార్ ద్వీప సమీపంలోని అక్కడ నివసించే ప్రజలు సముద్ర తాబేళ్లను తింటారు. అక్కడ లభించే సముద్ర తోబేళ్లకి మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ మాంసం కోసం చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి కూడా చాలా మంది ప్రజలు టాంజీనియాకు వస్తుంటారు. వివిధ రకాల ఫ్లేవర్లలో తాబేలు మాంసాన్ని అమ్ముతుంటారు. ఈ మాంసాన్ని తింటే కెలోటాక్సిజంకి దారితాస్తుంది. ఇది ఒక రకమైన ఫుడ్ పాయిజన్ లాంటిది. దీని ఫలితంగా ఒక్కొక్క సారి మరణాలు కూడా సంభవిస్తుంటాయి. అయినా లెక్క చేయకుండా ఇక్కడి ప్రజలు వీటిని తింటుంటారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Read More: ఆస్కార్ అవార్డ్స్ లో రెడ్ పిన్ ధరించిన నటులు.. ఎందుకో తెలుసా

ఈ మధ్యన తాబేలు మాంసం తిని ఎనిమిది మంది పిల్లలు సహా ఒక మహిళ మరణించారు. అలాగే 78 మంది అస్వస్థత పాలయ్యారు. ఈ షాకింగ్ ఘటనతో ఆఫ్రికా మొత్తం ఉలిక్కి పడింది. అనారోగ్యం పాలైనా వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మకోని జిల్లా వైద్యాధికారి హాజీ బకారి
మాట్లాడుతూ.. విషపూరితమైన ఆహారం తినడం వల్ల కొంత మంది మరణించారని మిగిలినవారు చికిత్స పొందతున్నారని తెలియజేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రజలకు తాబేలు మాంసం తినొద్దని అధికారంగా ప్రకటించింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×