EPAPER

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Lebanon Pager Blasts| ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు లెబనాన్ పౌరులను బలితీసుకొంటోంది. తన శత్రువులపై తెలివిగా, అనూహ్యంగా దాడి చేసే ఇజ్రాయెల్ ఈ సారి లెబనాన్ లోని హెజ్బుల్లాపై గురి పెట్టింది. తాజాగా లెబనాన్ లో దేశ వ్యాప్తంగా పేజర్ పరికరాలు పేలిపోయాయి.


బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 2800 మందికి పైగా గాయాలు కాగా.. 12 మంది మృతి చెందారు. ఈ పేలుళ్లతో హెజ్బుల్లా ఉక్కిరి బిక్కిరి అయింది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!


చనిపోయిన వారిలో ఒక పదేళ్ల బాలిక, మరో ఇద్దరు పౌరులు ఉన్నట్లు అధికారిక సమాచారం. మరోవైపు గాయపడినవారిలో లెబనాన్ లో ఇరాన్ దౌత్య అధికారి మొజ్తాబా అమానీ ఉండడం గమనార్హం. గాయలపాలైన 2800 మందిలో 200 మందికి సీరియస్ గా ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చనిపోయిన పదేళ్ల బాలిక హెజ్బుల్లా గ్రూప్ లో ఒక సభ్యుడి కూతురని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే పేజర్ పేల్లుళ్లు లెబనాన్ తో పాటు పొరుగు దేశం సిరియాలో జరిగాయి. సిరియాలో జరిగిన పేజర్ పేలుళ్లలో 14 మంది గాయపడ్డారని సమాచారం.

ఈ పేలుళ్ల పై హెజ్భుల్లా గ్రూప్ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. ”రాత్రి 3.30 గంటలకు ఒకేసారి దేశవ్యాప్తంగా పేజర్ పరికరాలు పేలిపోయాయి. ఇదేదో యాధృచ్చికంగా జరగలేదు. లెబనాన్ టెలికమ్యూనికేషేన్స్ నెట్ వర్క్ లో భద్రతా ఉల్లంఘన జరిగింది. దీని వెనుక ఇజ్రాయెల్ ఉందడంలో ఏ అనుమానం లేదు. చనిపోయిన వారిలో ఇద్దరు లెబనాన్ ఎంపీల టీనేజ్ కొడుకులు ఉండడం బాధాకరం. ఈ దుర్మార్గపు చర్య కోసం ఇజ్రాయెల్ ను తప్పకుండా శిక్షిస్తాం.” అని చెప్పారు.

2023లొ గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్ లో సెల్ ఫోన్లకు బదులు పేజర్ పరికరాలు ఉపయోగించాలని హెజ్బుల్లా గ్రూపు తన సభ్యులకు ఆదేశించింది. దీంతో లెబనాన్, సిరియాలో ఎక్కువ మంది సంప్రదింపులు, మెసేజ్‌లు పంపించడానికి ఫోన్లకు బదులు పాత టెక్నాలజీ పేజర్ పరికరాలు వినియోగిస్తున్నారు. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ ట్రాక్ చేసి, శత్రువులు మాటలు వినగలిగే టెక్నాలజీ కలిగి ఉందని ఇంతకుముందు చాలాసార్లు తేలింది.

1990, 2000 దశకంలో పేజర్లు ఉపయోగంలో ఉండేవి. పేజర్ పరికరాలు రెండు రకాలు. ‘ఒకటి వన్ వే పేజర్’, రెండవది ‘టు వే రెస్పాన్స్ పేజర్’. వన్ వే పేజర్ లో కేవలం మెసేజ్‌లు రిసీవ్ మాత్రమే చేసుకోవచ్చు. టు వే పేజర్ పరికరాలతో మెసేజ్ పంపించవచ్చు. ఇందులో డేటా సురక్షితంగా ఉంటుందని సెక్యూరిటీ రిస్క్ తక్కువగా ఉండడంతో హెజ్బుల్లా గ్రూప్.. ఇజ్రాయెల్ నుంచి తప్పించుకోవడానికి ఈ పేజర్లు ఉపయోగిస్తోంది.

అయితా లెబనాన్ లో జరిగిన పేలుళ్లు కారణం ఈ పేజర్ బ్యాటరీలు పేలిపోవడమే అని కొన్ని ప్రాథమిక రిపోర్ట్ ద్వారా తెలిసింది. కానీ హెజ్బుళ్లా మాత్రం పేజర్ పరికరాల లోపల ఒక సన్నని తీగ లాంటి పేలుడు పదార్థం కలిగిన తీగలున్నాయని.. వాటి ద్వారానే పేల్లుళ్లు సంభవించాయని హెజ్బుల్లా చెబుతోంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×