EPAPER

4-day work week | వారంలో నాలుగు రోజుల మాత్రమే డ్యూటీ.. ఫిబ్రవరి నుంచే అమలు!

4-day work week | ఒకవైపు సాఫ్ట్ వేర్ కంపెనీలు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇకలేదని.. ఆఫీసుకు రావాలని చెబుతున్న వేళ.. జర్మనీ దేశం మాత్రం ఇకపై వారానికి 4 రోజులు మాత్రమే పని చేసి.. మూడు రోజులు సెలవు తీసుకోండని చెబుతోంది. ఈ పనివిధానం ఫిబ్రవరి 2024 నుంచే అమలు చేయనుంది.

4-day work week | వారంలో నాలుగు రోజుల మాత్రమే డ్యూటీ.. ఫిబ్రవరి నుంచే అమలు!

4-day work week | ఒకవైపు సాఫ్ట్ వేర్ కంపెనీలు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇకలేదని.. ఆఫీసుకు రావాలని చెబుతున్న వేళ.. జర్మనీ దేశం మాత్రం ఇకపై వారానికి 4 రోజులు మాత్రమే పని చేసి.. మూడు రోజులు సెలవు తీసుకోండని చెబుతోంది. ఈ పనివిధానం ఫిబ్రవరి 2024 నుంచే అమలు చేయనుంది.


జర్మనీ దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ద్రవ్యోల్బణం రోజురోజోకీ పెరిగిపోతోంది. దీనికితోడు అక్కడ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కొరత ఉంది. ఈ కారణాలతో జర్మనీ లేబర్ యూనియన్ సంస్థలు వారానికి నాలుగు రోజు పని చేస్తే.. ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని.. తద్వారా పనిలో నాణ్యత పెరుగుతుంది ప్రతిపాదించారు. దీంతో జర్మన్ కంపెనీలు ఈ పనివిధానాన్ని ఆరు నెలల పాటు అమలు చేసి చూడాలని భావిస్తున్నాయి. ఈ ఆరు నెలల ట్రయల్‌ పనివిధానాన్ని జర్మనీలోని 45 కంపెనీలు అమలు చేసేందుకు అంగీకరించాయి.

ఈ పనివిధానాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా న్యూజిలాండ్‌కు చెందిన ఫోర్ డే వీక్ గ్లోబల్(4 day week global) అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేయనున్నారు.


2022లో ఫెడెరల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆకుపేష్నల్ సేఫ్టీ అండ్ హెల్త్ చేసిన సర్వేలో జర్మన్ పౌరులు సగటున నెలకు 21.3 రోజులు పనిచేయలేకపోతున్నారు. దీనివల్ల 207 బిలియన్ యూరోల నష్టం జరిగింది. అలాగే 2023 సర్వేలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల మనస్ఫూర్తిగా ఉద్యోగులు పనిచేయకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.1 ట్రిలియన్ యూరోలు నష్టపోయింది.

ఫోర్ డే వీక్ గ్లోబల్ సంస్థ ప్రకారం.. ఉద్యోగులు వారానికి 4 రోజులు పని చేసినా.. దానివల్ల ఇంతకుముందు ఉన్నంత పనే చేస్తారని.. వీలైతే ఇంకా ఎక్కువ పనిచేస్తారని వెల్లడించింది. దీనివల్ల కంపెనీ ఉత్పత్తి పెరుగుతుందని.. ఉద్యోగులు కూడా ఆరోగ్యంగా ఉండడంతో వారు సెలవు తీసుకోకుండా పనిచేస్తారని తెలిపింది. ఫలితంగా కంపనీలకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టాలు తగ్గించవచ్చని చెప్పింది.

కానీ జర్మనీ ఆర్థిక మంత్రి ఈ పనివిధానంపై విమర్శలు చేశారు. ఇలా చేయడం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి ఆగిపోతుందని మండిపడ్డారు. అయితే ఫోర్ డే వీక్ గ్లోబల్ సంస్థ దీనిపై స్పందిస్తూ.. గతంలో ఈ పనివిధానాన్ని అమెరికా, కెనెడా, బ్రిటన్, పోర్చుగల్ లాంటి దేశాలలో విజయవంతమైందని.. జర్మనీలో కూడా విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేసింది. పైగా జర్మనీలో పార్ట్ టైమ్ చేసేవారు ఎక్కువగా ఉండడంతో.. అలాంటి వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారని అభిప్రాయపడింది.

2022లో బెల్జియమ్ దేశం ప్రప్రథమంగా నాలుగు రోజుల పనివిధానం ప్రవేశపెట్టింది. అయితే ఇది ప్రత్యామ్నాయంగా మాత్రమే. ఉద్యోగులు అయిదు రోజులు పనిచేస్తే రోజుకు 8 గంటలు పనిచేయాలి. అదే నాలుగు రోజులు పనిచేస్తే.. రోజుకు 10 గంటలు డ్యూటీ చేయాలి.

ప్రపంచంలో ఈ నాలుగు రోజుల పనివిధానం జపాన్ అమలవుతోంది. ఉద్యోగులు వారంలో మిగతా మూడు రోజు కుటుంబంతో గడపితే జనాభా వృద్ది చెందుతుందని జపాన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. నిపుణులు కూడా జపాన్‌లో జనాభా తగ్గుదల సమస్యకు ఇది పరిష్కారమని చెప్పారు. పైగా ఇలా చేయడం వల్ల జపాన్ ప్రజలు కుటుంబంతో షాపింగ్ కోసం ఖర్చు చేస్తారని.. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు.

ఇండియాలో కూడా ఒక కంపెనీ షరతులతో తన ఉద్యోగులకు ఇదే ఆఫర్ చేసింది. ర్యాండ్ స్టాండ్ ఇండియా అనే కంపెనీ 2023 అక్టోబర్‌లో తన ఉద్యోగులు.. ఏడాది టార్గెట్ త్వరగా పూర్తిచేస్తే.. మిగతా నెలల్లో వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసి.. మూడు రోజులు సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది.

4-day work week, Germany, pilot project, boost economy, European Union, Business news,

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×