EPAPER

Biggest Heist in US: చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం.. రూ.250 కోట్లు స్వాహా!

Biggest Heist in US: చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం.. రూ.250 కోట్లు స్వాహా!
Largest Heist
Largest Heist

Biggest Heist in America : లాస్ ఏంజెల్స్ చరిత్రలోనే ఇది అతిపెద్ద దొంగతనం. ఒకటి రెండు కాదు.. అక్షరాలా 30 మిలియన్ డాలర్లు చోరీకి గురయ్యాయి. అంటే మన కరెన్సీలో 250 కోట్లకు పైగానే. మార్చి 31 ఈస్టర్ పండుగ రోజున జరిగిన ఈ దొంగతనాన్ని మరుసటి రోజున గుర్తించారు. నగదును నిల్వఉంచిన కేంద్రం నుంచి దోపిడీ జరిగినట్లు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్, ఎఫ్ఐబీ నిర్థారించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.


శాన్ ఫెర్నాండో వ్యాలీలో ఉన్న ఫెసిలిటీలోకి దొంగలు ప్రవేశించి, నగదును దోచుకెళ్లినట్లు ఎవరికీ తెలియలేదన్నారు పోలీసులు. నిజానికి ఆ ప్రాంతంలో వ్యాపారాలకు సంబంధించిన నగదు అంతా భద్రంగా ఉంచుతారని, ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. పైకప్పును తొలగించి లోపలికి చేరుకోవడంతో.. అలారం మోగలేదు. ఆ తర్వాత లాకర్ వద్దకు చేరుకుని డబ్బు మొత్తాన్నీ దోచుకెళ్లారు. సోమవారం (ఏప్రిల్1) ఫెసిలిటీ ఉద్యోగులు లాకర్ ను తెరిచి చూడగా పెద్దమొత్తంలో నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.

Also Read: Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?


అయితే నగదు చోరీకి గురైందని చెప్పేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇది తెలిసిన వారే చేశారా ? లేక నిజంగానే దొంగల పనా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. 1997లో జరిగిన చోరీ కంటే.. ఇదే భారీ దొంగతనం అని స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి. 1997 సెప్టెంబర్ లో డన్ బార్ ఆర్మర్డ్ ఇంక్ నుంచి 18.9 మిలియన్ల నగదు చోరీ జరిగింది. ఈ కేసులో మాజీ ఉద్యోగి సహా.. ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×