EPAPER

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Teen shot dead in bathroom by another: స్కూల్‌లో పాఠాలు వింటూ విద్య ఒంటబట్టించుకోవాల్సిన ఓ విద్యార్థి తన వెంట బ్యాగ్‌లో గన్ తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో బాత్రూం వెళ్లాడు. మరో స్టూడెంట్ కూడా బాత్రూంకు వచ్చాడు. వారిద్దరికి మధ్య గొడవ జరిగింది. మాటా.. మాటా పెంచుకుని కొట్టుకునేదాకా వెళ్లారు. ఇంతలో ఆ విద్యార్థి వెంట తెచ్చుకున్న గన్ తీశాడు. ఎదురుగా ఉన్న మరో విద్యార్థిని కాల్చేశాడు. ఆ విద్యార్థి రక్తపుమడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. గన్ తో షూట్ చేసి వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. కానీ, నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు.


ఈ ఘటన అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల వారెన్ కర్టిస్ గ్రాంట్ రోజులాగే జొప్పాటౌన్ హైస్కూ‌ల్‌‌కు వెళ్లాడు. అక్కడ క్లాసులు విన్నాక బాత్రూం వెళ్లాడు. అక్కడికే 16 ఏళ్ల నిందితుడు వచ్చాడు. వారిద్దరికి గొడవ జరిగిన తర్వాత వారెన్ కర్టిస్ గ్రాంట్‌ను తుపాకీతో కాల్చేశాడు. ఆ తర్వాత స్పాట్ నుంచి పరారయ్యాడు. అయితే, పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు.

ఇంకా నిందితుడిపై చార్జిషీట్ ఫైల్ చేయలేదని పోలీసు అధికారి జెఫ్ గాలర్ తెలిపారు. వయోజనుడిగా భావించే నిందితుడిపై అభియోగాలు నమోదు చేస్తామని వివరించారు. ఆ తర్వాత నిందితుడి పేరును వెల్లడిస్తామని చెప్పారు. తమ కార్యాలయంలో 2022 నుంచి ఇలాంటి పది ఘటనలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత కేసు దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నదని వివరించారు.


ఈ కాల్పుల ఘటన జరగ్గానే పోలీసు అధికారులు ఆ ఏరియాలోకి ప్రజలు రావద్దని హెచ్చరించారు. అయితే.. ఆ ఘటన కేవలం ఇద్దరి మధ్య జరిగిందేనని, పబ్లిక్‌ పై జరిపిన కాల్పులు కావలని వివరించారు. కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. తాము కేసు వీలైనంత త్వరగా ఛేదిస్తామని పేర్కొన్నారు.

Also Read: Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

ఈ ఘటనకు రెండు రోజుల క్రితమే అట్లాంటాలో 14 ఏళ్ల బాలుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురిని
పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన కూడా హైస్కూల్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

అమెరికాలో గన్ కల్చర్ పై మరోసారి చర్చ మొదలైంది. వెపన్ చట్టాలను కఠితనం చేయాలనే డిమాండ్లు మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో గన్ కల్చర్ పై చర్చ మొదలు కావడం గమనార్హం. గన్ కల్చర్ ఎన్నికలను ప్రభావితం చేసేంత బలమైన అంశం కూడా. త్వరలో ఈ విధానంపై ఎలాంటి ప్రకటనలు, అభ్యర్థులు ఎలాంటి అభిప్రాయాలను వెల్లడిస్తారో చూడాల్సి ఉన్నది.

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×