EPAPER

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

20 Killed in Balochistan| పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉగ్రవాదులు 20 మంది బొగ్గుగని కార్మికులను దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన గురువాం అక్టోబర్ 11, 2024న రాత్రి జరిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆసియా భద్రతా సమావేశాలకు కేవలం ఒక రోజు ముందు ఈ హింసాత్మక ఘటన జరగడం గమనార్హం.


బలూచిస్తాన్ లోని దూకి జిల్లాలో గురువారం రాత్రి కొంతమంది తుపాకీలు చేతబట్టుకొని బొగ్గుగనిలో ప్రవేశించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు తుపాకులతో బెదిరించి వారిని ఒక వరుసలో నిలబెట్టారు. ఆ తరువాత వారందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఇంతటితో ఆగక బొగ్గుగనిలో మెషీన్లు, ఇతర సామాగ్రిని రాకెట్లు, బాంబులతో ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 20 మంది మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా ఖైబర్ పష్తూన్ ఖ్వాకు చెందిన పష్తూన్ పఠాన్‌లున్నారు. మృతులలో ముగ్గురు, గాయపడిన నలుగురూ ఆఫ్ఘనిస్తాన్ కు చెందినవారు.

ఉగ్రవాదుల హింసాత్మక దాడికి నిరసనగా దూకి జిల్లాల్లోని వ్యాపారులు బంద్ ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ చేసిందో స్పష్టం కాలేదు. బలోట్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) మిలిటెంట్లు ఈ అమానవీయ ఘటన వెనుకు ఉండవచ్చనే అనుమానాలున్ానయి. ఇటీవల బిఎల్ఏ ఉగ్రవాదులు ఇలాంటి పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఆగస్టు నెలలో బలోచిస్తాన్ లోని ముషాఖెయిల్ జిల్లా నుంచి కరాచీ వెళ్లే మార్గంలోని కొన్ని వాహనాలకు ఆపి.. అందులోని 23 ప్రయాణికులను రహదారిపై కాల్చి చంపారు. గత రెండు నెలల్లో వేర్వేరు బిఎల్ఏ చేసిన హింసాత్మక దాడుల్లో 50 మంది దాకా చనిపోయారని సమాచారం.


Also Read: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

తాజాగా దూకీ జిల్లాలో బొగ్గు గని కార్మికుల హత్య పట్ల ప్రధాన మంత్రి షహ్బాజ్ షరీఫ్ స్పందించారు. బిఎల్ఏ మిలిటెంట్ల హింసాత్మక చర్యలను ఆయన ఖండించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మరోవైపు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ మాట్లాడుతూ.. ”కూలీ పని చేసే అమాయకుల దాడుల చేసి పాకిస్తాన్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను. ఈ ఘటన వెనుక ఎవరున్నా వారికి శిక్ష తప్పదు.” అని అన్నారు. మరో పాకిస్తాన్ మంత్రి మాట్లాడుతూ.. దోషులకు చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

పాకిస్తాన్ లోని బలోచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని బిఎల్ఏ మిలిటెంట్లు పోరాటం చేస్తున్నారు. బలూచిస్తాన్ లో పంజాబి, పఠాన్ల సామాజికవర్గకపు రాజకీయ నాయకుల పాలనకు వ్యతిరేకిస్తూ.. బలోచిస్తాన్ ప్రకృతి సంపదలు దోచుకుంటున్న చైనా, పాకిస్తాన్ రాజకీయ పార్టీలను అంతం చేస్తామని సాయుధ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఎయిర్ పోర్టులో ఇద్దరు చైనా ఇంజినీర్లను కొన్ని నెలల క్రితం కాల్చి చంపారు. అయితే ఇదంతా ఆసియా భద్రతా సమావేశాల సమయంలో జరగడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

మరోవైపు ఇస్తామాబాద్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బలోచిస్తాన్ గురువారం రాత్రి బొగ్గుగని కార్మికుల హత్య ఘటన జరిగిన కొన్ని గంటలకు ముందే సౌదీ అరేబియా, పాకిస్తాన్ వ్యాపార వర్గాల మధ్య 2 బిలియన్ డాలర్ల పెట్టబడుల ఒప్పంద కుదిరింది. ఈ పెట్టబడుల్లో కొన్ని బలోచిస్తాన్ కూడా ఉండడం విశేషం.

Related News

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

Israel Hits UN Base: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు

Naga Skull Auction: యూకేలో మనిషి పుర్రె వేలం.. భారత ప్రభుత్వం ఆగ్రహం

Woman Lands Plane: గాల్లో విమానం..పైలట్ భర్తకు గుండెపోటు.. భార్య ఏం చేసిందంటే?.

Nepal Teen Climbs Mountains: ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన టీనేజర్.. కేవలం 18 ఏళ్లకే రికార్డ్!

Omar Bin Laden: లాడెన్ కొడుకుకు దేశ బహిష్కరణ విధించిన ఫ్రాన్స్, అసలు ఏం జరిగిందంటే?

Big Stories

×