EPAPER

British Columbia Elections: బ్రిటీష్ కొలంబియా ఎన్నికల్లో భారతీయుల హవా.. ఏకంగా 14 మంది విజయం!

British Columbia Elections: బ్రిటీష్ కొలంబియా ఎన్నికల్లో భారతీయుల హవా.. ఏకంగా 14 మంది విజయం!

British Columbia Punjabi| కెనెడా దేశంలో భారత మూలాలున్న పౌరులు సత్తా చాటుతున్నారు. తాజా అక్కడ బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 మంది పంజాబీలు విజయం సాధించారు. బ్రిటీష్ కొలంబియా లో మొత్తం 93 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆదివారం అక్టోబర్ 20, 2024న వెలువడ్డాయి.


అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో పంజాబ్ సామాజికవర్గానికి చెందిన 14 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇంతకుముందు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 9 మంది పంజాబీలు విజయం సాధించగా.. ఈసారి ఈ సంఖ్య 14కు పెరగడం విశేషం.

కానీ ఈ ఎన్నికల ఫలితాలో బ్రిటీష్ కొలంబియా (British Columbia) రాష్ట్రంలో హంగ్ ఏర్పిడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. బ్రిటీష్ కొలంబియాలో రెండు ప్రధాన పార్టీలు.. న్యూ డెమొక్రటిక్ పార్టీ, కన్‌జర్వేటివ్ పార్టీ. ఇందులో గత ఏడు సంవత్సరాలుగా న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డిపి) అధికారంలో ఉంది. ఎన్‌డిపి కి ఈ ఎన్నికల్లో 46 సీట్లు రాగా.. ప్రతిపక్షంలో ఉన్న కన్‌జర్వేటివ్ పార్టీ 45 సీట్లు గెలుచుకుంది. మిగతా రెండు సీట్లు చిన్న పార్టీ అయిన గ్రీన్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 47 సీట్లు అవసరం ఉండడంతో ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు.. మిగిలిన ఇద్దరు గ్రీన్ పార్టీ అభ్యర్థుల వైపు చూస్తున్నాయి. దీంతో గ్రీన్ పార్టీ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఆవిర్భవించింది.


ఎన్నికల్లో గెలుపొందిన పంజాబీ అభ్యర్థుల్లో ప్రముఖల పేర్లు ఇలా ఉన్నాయి. ఎన్‌డీపీ అభ్యర్థి మాజీ హౌసింగ్ మినిస్టర్ రవి కహ్లోన్, మాజీ అటార్నీ జెనెరల్ నికీ శర్మ, రాజ్ చౌహాన్, జగ్రూప్ బ్రార్, సునీతా ధీర్, రవి పర్మార్, జెస్సీ సున్నెర్, రియా అరోరా, హర్విందర్ సంధు.

Also Read: మెక్ డొనాల్డ్స్ లో వంట చేసిన ట్రంప్!.. ఎన్నికల ప్రచారంలో కీలక ఓటర్లే టార్గెట్

మరోవైపు కన్‌జర్వేటివ్ పార్టీ తరపున విజయం సాధించిన పంజాబీల జాబితాలో హోన్‌వీర్ రంధావా, జోడీ తూర్, మన్‌దీప్ ధాలివాల్, హర్మన్ భంగు, స్టీవ్, కూనర్ ఉన్నారు.

వీరందరిలో ఎన్‌డీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్న జగ్రూప్ బ్రార్ ఏడుసార్లు ఎన్నికల్లో గెలవడం విశేషం. జగ్రూప్ బ్రార్ పంజాబ్ లోని భంటిండాకు చెందిన వారు. ఈయన బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే ఫ్లీట్ వుడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రేడ్ గా పనిచేశారు.

మాజీ హౌసింగ్ మినిస్టర్ రవి కహ్లోన్ రాజకీయాల్ల రాక హాకీ ఆడేవారు. కెనెడా తరపున ఆయన ఒలింపిక్స్ లో రెండు సార్లు హాకీ ఆడారు. రవి కెహోలన్ డెల్టా నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

మరోవైపు రాజ్ చౌహాన్ వరుసగా అయిదు సార్లు ఎన్నికల్లో గెలిచారు. ఈయన ఇంతకుముందు అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ గా, ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నారు. ఎన్నికల్లో బుర్నేబీ వెస్ట్ మినిస్టర్ సీటు కైవసం చేసుకున్నారు. సునీతా ధీన్ వేంకోవర్ లంగారా సీటు నుంచి విజయం సాధించగా.. జెస్సీ సున్నర్.. సుర్రే న్యూటన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కన్‌జర్వేటివ్ పార్టీ తరపున మన్దీప్ ధాలివాల్ సుర్రే నార్గ్ లో ఎన్‌డీపీ చెందిన రచనా సింగ్ ను ఓడించారు. హర్మన్ సింగ్ భంగు లాంగ్లే అబ్బాట్సఫోర్ట్ సీటుపై విజయం సాధించారు. ప్రముఖ లాయర్ హోన్‌వీర్ సింగ్ రన్‌ధావా సుర్రే గిల్డ్ ఫోర్డ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఎన్‌డిపీ ప్రభుత్వంతో విసుగుచెందిన ఓటర్లు కన్‌జర్వేటివ్ పార్టీకి ఓట్లు వేశారని హోన్‌వీర్ సింగ్ అన్నారు. ఎన్నికల్లో కార్బన్ ఉద్గారాలపై ప్రభుత్వం విధించిన పన్నుని రద్దు చేస్తామని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎక్స్ పోర్ట్ ఇండస్ట్రీని మరింత విస్తరించేందకు కృషి చేస్తామని కన్‌జర్వేటివ్ పార్టీ హామీలు ఇచ్చింది. 2017లో కూడా ఇలాగే హంగ్ ఫలితాలు వచ్చినప్పుడు గ్రీన్ పార్టీతో ఎన్‌డీపీ పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం గమనార్హం.

Related News

Yahya Sinwar Tunnel: ప్రజలు చనిపోతుంటే విలాసాల్లో నాయకుడు.. యహ్యా సిన్వర్ టన్నెల్ వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్

Australia King Charles: ‘ఇది మీ దేశం కాదు’.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బ్రిటన్ రాజుకు ఘోర అవమానం

Trump Mc Donalds: మెక్ డొనాల్డ్స్‌లో వంట చేసిన ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ‘ఇండియన్’ ఫార్ములా?

ISIS: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ

Elon Musk 1 Million dollar: డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన

Maternity Leave Job Loss: మెటర్నిటి లీవ్ అడిగితే ఉద్యోగం నుంచి తొలగించిన బాస్.. ఆమె చేసిన తప్పేంటంటే..

Big Stories

×