EPAPER

Massive Oil Spill: చమురు నౌక మునక..

Massive Oil Spill: చమురు నౌక మునక..

Massive Oil Spill Caribbean Island: కరీబియన్ ఐలాండ్ సమీపంలో గుర్తు తెలియని నౌక ప్రమాదానికి గురైంది. ఆ నౌకలోని చమురు 15 కిలోమీటర్ల మేర తీర ప్రాంతాన్ని ముంచెత్తించింది. ట్రినిడాడ్, టబేగోకు చెందిన దాదాపు 1000 మంది వాలంటీర్లు చమురు లీకేజీని అడ్డుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.


ఈ నేపథ్యంలో టబేగో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. చేపలవేటకు దూరంగా ఉండాలని, సెయిలింగ్ కార్యకలాపాలు కూడా చేపట్టొద్దని చెప్పారు. ఈ ప్రమాదాన్ని లెవల్-3గా ప్రకటించారు. అట్లాంటిక్ తీరంలోని బీచ్‌లు, రీఫ్‌లకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు పర్యావరణ‌వేత్తలు చెబుతున్నారు.

Read More: PAK Elections 2024: ఎన్నికల ఫలితాల్లో జాప్యం.. దేశవ్యాప్తంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిరసన..


కార్నివాల్ టూరిజంపై ఆధారపడిన కరీబియన్ ఐలాండ్‌లోని రిసార్ట్‌లు, హోటళ్ల వ్యాపారంపైనా దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని భావిస్తున్నారు. మునకకు గురైన నౌకను గల్ఫ్‌స్ట్రీమ్‌గా గుర్తించారు. దక్షిణ టబేగోలోని కోవ్ ఎకో-ఇండస్ట్రియల్ పార్క్ తీరానికి 200 మీటర్ల దూరంలో బుధవారం ఈ నౌక మునిగిపోయింది. ప్రస్తుతం చమురును తొలగించే పని ముమ్మరంగా సాగుతోంది.

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×