EPAPER

YouTube : యూట్యూబ్ లవర్స్‌కి పిడిగులాంటి వార్త… నేటి నుంచే ఈ మార్పులు అమలు..!

YouTube : యూట్యూబ్ లవర్స్‌కి పిడిగులాంటి వార్త… నేటి నుంచే ఈ మార్పులు అమలు..!

YouTube.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన యూట్యూబ్ (YouTube)అత్యంత ప్రజాదారణ పొందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ గా పేరు సొంతం చేసుకుంది. ప్రపంచ నలుమూలాల జరిగే విషయాన్ని ఇట్టే క్షణాల్లో అందరికీ తెలియజేసే సమాచార వేదిక అని చెప్పవచ్చు. యూట్యూబ్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. 2005 ఫిబ్రవరి 14వ తేదీన అంటే దాదాపు 19 సంవత్సరాల క్రితమే దీనిని ఆల్ఫాబెట్ అనే వ్యక్తి స్టీవ్ చెన్, చాడ్ హార్లీ, జావిద్ కరీం అనే వ్యక్తులతో కలిసి సంయుక్తంగా స్థాపించారు.


కొత్త టాలెంట్ పై నీళ్లు చల్లిన యూట్యూబ్..

ముఖ్యంగా ఈ యూట్యూబ్ అనేది కొత్త టాలెంట్ కు వేదిక అనడంలో సందేహం లేదు. చాలామంది తమ టాలెంటును నిరూపించుకోవడానికి యూట్యూబ్ ను ఒక వేదికగా చేసుకొని, ప్రపంచానికి తమ ప్రతిభను పరిచయం చేస్తున్నారు. ఇందులో చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకు వినోద బరితమైన సన్నివేశాలను మొదలుకొని మరెన్నో విషయాలను ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. ముఖ్యంగా టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, చిన్న డాక్యుమెంటరీలు, ఆడియో రికార్డింగ్ లు, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, వీడియో బ్లాగింగ్, విద్యా సంబంధిత వీడియోలు, రాజకీయ వార్తలు ఇలా ఒక్కటేమిటి మనకు ఏం కావాలన్నా సరే ఇట్టే యూట్యూబ్ ను తెరిచేసి వాటి గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఇందులో సభ్యత్వం పొందడం కూడా చాలా సులభం. ఎటువంటి డబ్బులు కట్టకుండానే సొంతంగా ఛానల్ క్రియేట్ చేసుకుని తమ టాలెంట్ ను ఉపయోగించుకుంటున్నారు. ఇకపై ఇలాంటివన్నీ కుదరవు అంటూ యూట్యూబ్ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది.


యూట్యూబ్ షార్ట్స్ ఇకపై మూడు నిమిషాలు..

సాధారణంగా యూట్యూబ్ షార్ట్స్ కేవలం ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ నిడివితో ప్రజలు వీడియోలను వదిలేవారు. అయితే ఇకపై అవన్నీ కుదరవని ఒక్కో యూట్యూబ్ షార్ట్ విడుదల చేయాలి అంటే మినిమం మూడు నిమిషాల సమయం ఉండాలి అని, మూడు నిమిషాల నిడివి ఉన్న షార్ట్ మాత్రమే యూట్యూబ్ ఇకపై తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ నెల ఆఖరి నుంచి ఇకపై కొత్త ఛానల్ ఓపెన్ చేయడానికి కుదరదు అన్నట్లుగా కూడా ఒక వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు నుంచి యూట్యూబ్ షార్ట్ నిడివి మూడు నిమిషాలు ఉండాల్సిందే అంటూ కొత్త రూల్ విధించినట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది.

కొత్త ఛానల్ కి ఆస్కారం లేదు..

దీనికి తోడు ఈ మంత్ ఎండింగ్ నుండి కొత్త ఛానల్ ఓపెన్ చేయడానికి ఆస్కారం లేదన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా యూట్యూబ్ కొత్త టాలెంట్ పై నీళ్లు చల్లడమే కాకుండా డైలీ వన్ మినిట్ షార్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఎంతోమంది ఇప్పుడు మూడు నిమిషాలు కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే అత్యంత కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. మొత్తానికైతే యూట్యూబ్ తీసుకున్న నిర్ణయం అటు యూట్యూబర్స్ కి ఇటు కొత్తగా టాలెంట్ ను నిరూపించుకోవాలనుకున్న వారికి అత్యంత కష్టంగా మారిందని చెప్పవచ్చు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

గమనిక: యూట్యూబ్ కి సంబంధించి వస్తున్న వార్తలకు, బిగ్ టీవీ ఛానల్ కు ఎటువంటి సంబంధం లేదు.

Related News

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Big Stories

×