EPAPER

Yatra 2 Movie Review: యాత్ర2 మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాగా చూస్తే ఎలా ఉందంటే..?

Yatra 2 Movie Review: యాత్ర2 మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాగా చూస్తే ఎలా ఉందంటే..?

Yatra 2 Movie Review: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ‘యాత్ర2’ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాన స్వీకారం చేసే వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సీక్వెల్ మూవీ తెరకెక్కింది.

వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించగా.. జగన్ పాత్రలో జీవా యాక్ట్ చేశారు. అయితే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది?.. మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారు? అనే విషయాన్ని ఫుల్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


కథ విషయానికొస్తే.. 2009లో వైయస్సార్ (మమ్ముట్టి) రెండో సారి సీఎం అవుతారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణిస్తారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు.

కానీ ప్రోగ్రెస్ పార్టీ హైకామండ్ మాత్రం జగన్‌ను కాదని.. రోశయ్యను సీఎం చేస్తుంది. ఆ తర్వాత వైయస్సార్ మరణవార్తతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో.. వాళ్లని పరామర్శించడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపడతారు.

READ MORE: Yatra 2 Movie : సోనియా పాత్ర.. యాత్ర- 2లో సరికొత్త ట్విస్ట్..

ఆ యాత్ర ఆపేయమని హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి మొండిగా ఓదార్పు యాత్రను చేపడతారు. దీంతో ఈ విషయంపై ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ జగన్‌పై చర్యలకు సిద్ధపడుతుంది. దీంతో జగన్ ఆ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటు చేస్తారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొన్నారు. ఉప ఎన్నికలు, 2014 – 2019 ఎన్నికల్లో ఏం జరిగింది?. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి జగన్ పార్టీకి ఎలాంటి పోటీ ఎదురైంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈ మధ్య అందరికీ తెలిసిన కథలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే వాటిని చూపించే విధానంలో మాత్రం ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా తన మార్క్‌ని చూపించి హిట్లు అందుకుంటున్నారు. అలాంటి టాస్క్‌ని ‘యాత్ర’ సినిమాతో దర్శకుడు మహి వి రాఘవ్ మంచి సక్సెస్‌ను అందుకున్నారు.

అయితే వైయస్సార్ బయోపిక్‌గా కాకుండా ఆయన చేసిన పాదయాత్రను హైలైట్ చేస్తూ దర్శకుడు చూపించిన తీరు అద్భుతంగా ఉంది. కథతో కంటే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

ఫస్టాఫ్‌లో డ్రామా చాలా బాగుంది. సెకండాఫ్‌లో డ్రామా తగ్గినా.. పతాక సన్నివేశాల్లో హైప్ ఇచ్చి చూపించిన తీరు ఓ రేంజ్‌లో ఉంది. ఇక ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇది వన్ సైడెడ్ పొలిటికల్ అజెండాతో వచ్చిన సినిమా. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ‘యాత్ర2’ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శకుడు మాత్రం దీనిని ఒక సినిమాగా కాకుండా.. ఓ కథగా చెప్పారు.

READ MORE: 2024 Tollywood Movies: ఎలక్షన్స్ రెడీ.. సినిమాలు కూడా సిద్ధమయ్యాయి..

ఇక యాత్ర2 మూవీలో వైయస్సార్ పాత్రలో నటించిన మమ్ముట్టి మరోసారి తనదైన శైలిలో నటన, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశారు. ఇక జగన్ పాత్రలో నటించిన జీవను ఇంత వరకు ఇలాంటి స్థాయి పాత్రలో ఎవరూ వాడుకోలేదు. సినిమా ప్రారంభమైన కాసేపటికే జీవా అని మరిచిపోయి జగన్ అనే మైకంలోకి వెళ్లిపోతాం.

వైఎస్ జగన్ యాటిట్యూడ్‌, మేనరిజాన్ని జీవా బాగా పట్టుకున్నారనే చెప్పాలి. వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి, చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్‌ల పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. వారి పాత్రలో బాగా వొదిగిపోయారనే చెప్పాలి.

తండ్రి వైయస్సార్ మరణానంతరం జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జగన్ ప్రయాణాన్ని ఇంతలా మరెవరూ చెప్పలేరేమో! అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకు అసలైన బలం సంగీతమనే చెప్పాలి.

సంతోష్ నారాయణన్ ఈ మూవీకి అందించిన మ్యూజిక్ ప్రేక్షకాభిమానులను కట్టిపడేసింది. మహి వి రాఘవ్ రచన, దర్శకత్వం, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ప్రతీది ఆకట్టుకుంది.

READ MORE: Pawankalyan: ‘యాత్ర-2’కి పోటీగా.. పవన్ కల్యాణ్ మూవీ రీ-రిలీజ్.. ఏపీ ఎన్నికలే టార్గెట్..?

ఓవరాల్‌గా ఈ సినిమా వైయస్సార్, జగన్ అభిమానులకు పండగే అని చెప్పాలి. అంతేకాకుండా ఈ మూవీ ఎన్నికలకు ముందు వైయస్సార్ పార్టీకి మంచి బూస్టింగ్. ఇక ప్రతిపక్షాలకు మాత్రం.. సినిమా ఏముందిలే అని అనిపించొచ్చు.

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×