EPAPER

Kasthuri Shankar: నన్ను అలా వేధించారు, దీనిపై మోహన్ లాల్ ఎందుకు మాట్లాడటంలేదు? నటి కస్తూరి కామెంట్స్

Kasthuri Shankar: నన్ను అలా వేధించారు, దీనిపై మోహన్ లాల్ ఎందుకు మాట్లాడటంలేదు? నటి కస్తూరి కామెంట్స్

Kasthuri Shankar comments on Mohanlal and Suresh Gopi: మలయాళ సినీ పరిశ్రమలో పెద్ద కుదుపు తెచ్చింది జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. మల్లు ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై జరుగుతున్న లైంగిక వేధింపులు వెలుగులోకి తెచ్చింది ఈ కమిటీ. ఈ నేపథ్యంలో నటి కస్తూరి శంఖర్ తనకు జరిగిన అనుభవాలను పంచుకుంది. కస్తూరి తనకు మాలీవుడ్‌లో చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. గతంలో తన మలయాళ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ కంట్రోలర్ తరచూ తనతో కోపంగా మాట్లాడేవాడని ఆరోపించింది. ఆ తర్వాత మలయాళంలో మూవీస్ తీయలేదని ఆమె lతెలిపింది. హేమా కమిటీ రిపోర్ట్ సరైన దశలో ముందడుగు వేసిందని కస్తూరి శంకర్ పేర్కొంది. ఈ తరుణంలో నటి కస్తూరి.. మలయాళ సూపర్ స్టార్లు మోహన్‌లాల్, సురేష్ గోపీలపై తీవ్ర విమర్శలు చేశారు.


ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు. మీడియా ప్రశ్నల నుండి మోహన్‌లాల్, సురేష్ గోపీ  ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. వీరు కోపం తెచ్చుకునే బదులు మాలీవుడ్ లో జరుగుతున్న సమస్యలపై స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలలో నటించిన నటి ముఖేష్‌పై లైంగిక వేధింపుల కేసు తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పలువుకు సినీ నటులతో నటించిన మోహన్ లాల్.. తన సినిమాలో ఆడవారిపై హింస ఎప్పుడు  జరగలేదని ఎందుకు చెప్పలేకపోయాడు ? అని కస్తూరి ప్రశ్నించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అందరూ అమ్మకు రాజీనామా చేసి పారిపోయారు? మహిళల ఆరోపణలు అబద్దమైతే స్పందించండి.. ఎందుకు మాట్లాడటంలేదు అని కస్తూరి శంకర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: ‘ఆడవారికి ఆడవారే శత్రువులు’ అంటూ సంచలన కామెంట్ చేసిన నటి జ్యోతి పూర్వాజ్


అదే విధంగా కేరళ బీజేపీ తొలి లోక్‌సభ ఎంపీ అయిన నటుడు సురేశ్‌ గోపీపై విమర్శలు గుప్పించిన ఆమె.. మోదీ ప్రభుత్వంలో మంత్రిగా మాలీవుడ్‌లోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గోపీపై ఉందన్నారు. కస్తూరి మాట్లాడుతూ.. మోహన్‌లాల్, సురేశ్ గోపీ ప్రశ్నలకు ఎందుకు దూరంగా ఉంటారని.. ప్రశ్నలకు దూరంగా ఉంటే.. మాకు అనుమానం వస్తుందని.. ఎవరు దోషులు కాకపోతే ప్రెస్‌ని ఎదుర్కొని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి” అని ఆమె తెలిపారు.

గతంలో హేమ కమిటీ రిపోర్టు విడుదలకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గోపీ తీవ్రంగా స్పందించి మీడియా ప్రతినిధులను తోసేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు నివేదిక గతంలో వెల్లడించింది. హేమ కమిటీ నివేదికలు ఆలస్యం కావచ్చు.. కానీ ఇది సరైన దిశలో ఒక అడుగు అని కస్తూరి పేర్కొన్నారు. అయితే నివేదికలోని వెల్లడితో తాను పూర్తిగా సంతృప్తి చెందలేదని ఆమె అన్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×