Big Stories

Where is Pushpa: పుష్ప 2 స్టోరీ ఇదేనా? పులికే బెదురు.. ఇక, షెకావత్‌కు? తగ్గేదేలే..

pushpa-2-the-rule

Where is Pushpa: పుష్పకు ఫారెస్ట్ ఆఫీసర్ షెకావత్‌కు గొడవతో పుష్ప 1 ఎండ్ అవుతుంది. వాట్ నెక్ట్స్? పుష్ప 2 లో ఏముంటుంది? ఇదే ఇంట్రెస్టింగ్. అసలే సుకుమార్. కథ, స్క్రీన్‌ప్లేతో ఆటాడుకోవడంలో ఎక్స్‌పర్ట్. అలాంటి సుకుమార్.. పుష్ప 2 కోసం మరింత స్పెషల్ ఫోకస్ పెట్టారు. బన్నీ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే టీజర్ వదిలారు. వేర్ ఈజ్ పుష్ప? అంటూ 3 నిమిషాల వీడియో క్లిప్‌తో.. 3 గంటల సినిమాపై అమాంతం హైప్ పెంచేశారు. పుష్ప 2 గ్లింప్స్ చూస్తే.. గూస్ బంప్సే.

- Advertisement -

సెకండ్ పార్ట్‌లో షెకావత్‌కు పుష్పకు ఓ రేంజ్‌లో టగ్ ఆఫ్ వార్ జరుగుతుందని అర్థమవుతోంది. ఎత్తుకు పైఎత్తులతో.. వారి మధ్య ఆధిపత్య పోరు నడిచేలా ఉంది. ఆ వార్‌లో పుష్ప అబ్స్కాండింగ్ అవుతాడు కాబోలు. కనిపించకుండా పోయిన పుష్పరాజ్ కోసం ఫారెస్ట్ బృందాలు విస్తృతంగా గాలిస్తుండటం.. వేట కుక్కలతో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండటం.. అడవిని మొత్తం జల్లెడ పడుతుండటం.. ఈ వీడియోలో చూడొచ్చు.

- Advertisement -

మరోవైపు పుష్ప మిస్సింగ్ అనే విషయం మీడియాలో, ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. టీవీల్లో లైవ్ కవరేజ్‌లు, స్పెషల్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. జనాలు పుష్ప గురించే చర్చించుకుంటూ ఉంటారు. పుష్ప విదేశాలకు పారిపోయాడా అనే ప్రచారమూ జరుగుతుంది. ఈలోగా పుష్పను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారనే వార్త గుప్పుమంటుంది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లో విధ్వంసం సృష్టిస్తారు. షాపులు ధ్వంసం చేస్తారు. వాహనాలను తగలబెడతారు.

మధ్యలో పుష్ప గురించి ప్రజలు మాట్లాడే విషయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. పుష్ప గురించి పబ్లిక్ టాక్ చాలా పాజిటివ్‌గా వినిపిస్తుంది. పుష్ప తమకు ఎంతో సహాయం చేశాడంటూ వారంతా చెబుతుంటారు. గుండె ఆపరేషన్‌కు డబ్బులిచ్చాడని.. తమకు ఇల్లు కట్టించాడని.. తమ పిల్లలను చదివించాడని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విషయం చెబుతుంటారు.

కట్ చేస్తే.. వీడియో ఎండింగ్‌లో అదిరిపోయే సీన్. గూస్ బంప్స్ వచ్చేవి ఇక్కడే. ఓ నైట్ విజన్ కెమెరా ఉంటుంది. అందులో పులి వస్తున్న విజువల్ రికార్డ్ అవుతుంటుంది. అంతలోనే ఆ పులి ఎవరినో చూసి బెదురుతుంది. రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. ఈలోగా ఓ ముసుగు వ్యక్తి పులి పక్కనుంచి వెళ్తూ ఆగిపోతాడు. వెనక్కి తిరిగి కెమెరా వైపు చూస్తాడు. ఆ ముసుగు వీరుడు మరెవరో కాదు.. పుష్ప. పుష్ప రాజ్. తగ్గేదేలే అంటూ తన సిగ్నేచర్ స్టైల్ మేనరిజం చూపిస్తాడు. బ్యాక్ గ్రౌండ్‌లో డైలాగ్ మరింత అదిరిపోతుంది. జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే.. పులి వచ్చిందని అర్థం. అదే, పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప వచ్చాడని అర్థం.. అంటూ సుకుమార్ స్టైల్ పవర్‌ఫుల్ డైలాగ్ వస్తుంది. ఆ సీన్ టోటల్ వీడియోకే హైలైట్.

ఇక ఆఖరిలో అసలు స్టోరీ రివీల్ చేసినట్టున్నారు. అందులో ఎప్పటిలానే పుష్ప రంగురంగుల చొక్కా వేసుకొని.. కళ్లకు అద్దాలు పెట్టుకుని.. వెనుక అతని అనుచరులంతా నిల్చొని ఉంటే.. కుర్చీలో దర్జాగా కూర్చొని.. పుష్ప చెప్పిందే వినాలి.. ఇది పుష్ప రూల్.. అంటూ సెకండ్ పార్ట్ టైటిల్‌కు తగ్గ డైలాగ్ ఉంటుంది.

ఈ లాస్ట్ బిట్‌ను బట్టి చూస్తే.. పుష్ప సిండికేట్ లీడర్ అయ్యాక.. ఇక అతని ఏలుబడి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. పుష్పను అడ్డుకోవడానికి షెకావత్ ప్రయత్నించడం.. ఆ క్రమంలో పుష్ప అడవుల్లోకి వెళ్లడం.. వీరప్పన్ మాదిరి ఎదగడం.. ఇలా ఉంటుంది కావొచ్చు పుష్ప 2.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News