EPAPER
Kirrak Couples Episode 1

Actress Jhansi: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?

Actress Jhansi: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?

Actress Jhansi: మలయాళ ఇండస్ట్రీలో హేమా కమీటీ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. భారతదేశ చిత్ర పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఎంతో మంది నటీమణులు  తమ బాధను వెళ్లగక్కారు. ఎన్నో ఏళ్లుగా మనసులో గూడు కట్టుకున్న బాధ మొత్తాన్ని ఈ హేమా కమిటీ వలన ప్రపంచానికి తెలిసేలా చెప్పారు. అవకాశాల ఇస్తామని కొందరు.. అదును దొరికిందని కొందరు.. మాటలతో, చేతలతో అమ్మాయిలను ఎంతలా వేధించారో ఒక్కొక్కరు చెప్తుంటే.. వినేవారి రక్తమే మరిగిపోయింది.


అయితే అన్ని ఇండస్ట్రీల నుంచి లైంగిక వేధింపులకు గురైనవారు తమ గోడును వెళ్లగక్కుతుంటే.. హమ్మయ్య టాలీవుడ్ లో ఇలాంటివి లేవు అనుకోని తెలుగువారు గర్వంగా ఫీల్ అయ్యారు. అది కూడా అనుకున్నంత సేపు నిలువ లేదు. జానీ మాస్టర్ కేసు బయటపడేవరకు.. టాలీవుడ్ లో ఇలాంటివి జరగలేదేమో.. ఆరోపించినవారే తప్ప ఆధారాలతో నిరూపించినవారు లేరు కదా అనుకున్నారు. జానీ మాస్టర్ వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. జూనియర్ డ్యాన్సర్ ను లైంగికంగా వేధించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనికి కఠిన శిక్ష పడాలని  టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం డిమాండ్ చేస్తుంది.

ప్రముఖులు సైతం బాధితురాలికి అండగా నిలబడ్డారు. ఇక ఇలాంటి కేసులు ఇకముందు టాలీవుడ్ లో రాకుండా ఉండాలని మలయాళంలో హేమా కమీటీలానే ఇక్కడ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ ప్యానెల్ లో K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్‌పర్సన్ గా ఉండగా అంతర్గత సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ఉన్నారు.


ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇలాంటి ఒక కమిటీకి చైర్మన్ గా ఝాన్సీని ఎలా తీసుకున్నారు.. ? అనేది ప్రస్తుతం చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న. సాధారణంగా ఒకరికి మంచి చెప్పాలంటే.. ముందు ఆ వ్యక్తి మంచిగా ఉండాలి అని అంటారు. లైంగిక వేధింపుల కమిటీకి ఛైర్మన్ గా.. విడాకులు తీసుకున్న మహిళ,  భర్తపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ ఉండడం సబబేనా అని కొందరు ప్రశిస్తున్నారు. ఏంటి.. ఝాన్సీకి పెళ్లి అయ్యి, విడాకులు కూడా అయ్యాయా.. ?  భర్తపై కేసు కూడా పెట్టిందా.. ? అని నోర్లు వెళ్ళబెట్టకండి. ఝాన్సీ ఎవరు.. ? ఆమె భర్త ఎవరు.. ?  అనేది తెలుసుకుందాం రండి.

ఝాన్సీ..  1994 లో ఒక టీవీ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. ఇప్పుడంటే యాంకర్ అంటే టక్కున సుమ ఎలా గుర్తుకు వచ్చేదో.. అప్పట్లో యాంకర్ అంటే ఝాన్సీ అనే చెప్పేవారు. ఎన్నో షోస్ కు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెరకు మకుటం లేని మహారాణిగా ఏలింది.. టాక్ ఆఫ్ ది టౌన్ అనే షోకు ఆమె వేసినన్ని గెటప్స్ ఇప్పటివరకు ఎవరు వేయలేదు.. ఇక వేయబోరు కూడా. అలా టీవీ నుంచి సినిమాలకు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటివరకు 9 నంది అవార్డులను ఆమె అందుకుంది. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే ఝాన్సీ.. నటుడు జోగి నాయుడుతో ప్రేమలో పడింది. ఒక యాడ్ ఫిల్మ్ షూట్ లో ఝాన్సీని కలిసిన జోగి నాయుడు.. వెంటనే ప్రేమలో పడ్డాడు. 9 ఏళ్లు వీరు రిలేషన్ లో ఉన్నారు. పెళ్లి తరువాత కొన్నేళ్లు బాగానే ఉన్నా.. ఇద్దరి కెరీర్లు పీక్స్ లో ఉన్నప్పుడు వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రిలేషన్ లో ఉన్నప్పుడు హ్యాపీ గా ఉన్న ఝాన్సీ పెళ్లి తరువాత అతనితో కేవలం 13 నెలలు మాత్రమే కలిసి ఉంది.

ఇక ఈ జంటను కలపడానికి చిరంజీవి కూడా దిగివచ్చాడు. జోగి నాయుడు మంచివాడని, అతనితో కలిసి ఉండాలని చిరు చెప్పినా కూడా ఝాన్సీ వినలేదు. నెలల పాపను తీసుకొని..  జోగినాయుడు నుంచి వేరుపడింది. కూతురు కోసం జోగినాయుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. కనీసం కూతురు ముఖాన్ని చూపించడానికి కూడా ఝాన్సీ ఇష్టపడలేదు. కూతురు కోసం న్యాయపోరాటమే చేసిన భర్తపై ఝాన్సీ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఇక ఇలాంటివి ఆమె గతంలో చాలా ఉన్నాయి. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఝాన్సీ.. ఇలాంటి కమిటీకి ఛైర్మన్ గా పనికివస్తుందా.. ? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో పెద్దవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి గొడవలు లేకుండా భర్తతో కలిసి జీవించేవాళ్ళు ఉన్నారు. వారందరిని వదిలేసి ఈమెను ఛైర్మన్ గా చేయడం ఏంటి.. ? అనేది ప్రశ్న.

లైంగిక వేధింపుల కమిటీకి భర్తపై కేసు పెట్టినవారు పనికిరారా.. ? ఇదెక్కడి విడ్డూరం అమ్మ అని ఇంకొందరు అడగొచ్చు. ఒకసారి  మగవాళ్లపై ఇలాంటి లైంగిక వేధింపుల కేసు పెట్టినవారు.. భర్తనే కాదని బయటకు వచ్చినవారు.. రేపొద్దున ఒక హీరో మీద ఒక అమ్మాయి డబ్బు కోసమో, పేరు తెచ్చుకోవడానికో లేనిపోని ఆరోపణలు చేసినప్పుడు.. ఇలాంటివారు.. అమ్మాయి మాటలను విని, మగవారు అందరూ అలానే అనుకోని తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు.. ఇరు వర్గాల వాదనలను విన్నాకనే కదా.. న్యాయం ఎవరివైపు ఉంటుంది అనేది తెలిసేది. మరి ఇలా ఇప్పటికే ఒక మైండ్ సెట్ తో ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా అనేది కూడా అంచనా వేసుకోని తీసుకోవాలి కదా అని మరికొందరు చెప్తున్నారు. ఏదిఏమైనా ఝాన్సీ ఈ పదవికి అర్హురాలా.. ? కాదా.. ? అనేది కాలమే నిర్ణయించాలి.

Related News

Suchithra: ఆ లెజెండరీ డైరెక్టర్ పెద్ద కామ పిశాచి.. చచ్చే వరకు ఎవరిని వదలలేదు

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Rakesh Master: అందుకు జానీ కాలర్ పట్టుకున్నాను, తనలో ఆ క్వాలిటీ ఉంది.. రాకేష్ మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Aishwarya Rajesh: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

Big Stories

×